పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 8 వాకాడు మండలం,
శనివారం సాయంత్రం వాకాడులో తూనికలు కొలతలు శాఖ అధికారి బాబాసాహెబ్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. వ్యాపారస్తులు
ఉపయోగిస్తున్న త్రాసులు, తదితర సామాగ్రిని అధికారి క్షుణ్ణంగా పరిశీలించారు.
సరైన కొలతలు, తూకాలు లేకపోతే చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులను హెచ్చరించారు .
ఎలక్ట్రానిక్ కాటాలలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది.



