Saturday, 26 September 2026
  • Home  
  • 11వ రోజుకు చేరుకున్న విఆర్ఎ ల సమ్మె ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కి వినతి పత్రం అందజేత
- తూర్పు గోదావరి

11వ రోజుకు చేరుకున్న విఆర్ఎ ల సమ్మె ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కి వినతి పత్రం అందజేత

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 26 : వీఆర్ఏ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి పిలుపు మేరకు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా 11 వ రోజు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాల వీఆర్ఏ లు సమ్మెను కొనసాగిస్తున్నారు. శనివారంకాకినాడ జిల్లా వి ఆర్ ఎ ల సంఘం అధ్యక్షులు నిడమర్తి సురేష్ఇశ్రాయేలు ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం లో గల నాలుగు మండలాలు జగ్గంపేట, గోకవరం, గండేపల్లి, కిర్లంపూడి మాడలాల వి ఆర్ ఎ లు జగ్గంపేట ఎమ్మార్వో కార్యాలయం నుండి రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించుకుంటూ వచ్చి జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో జగ్గంపేట మండలం అధ్యక్షులు ఇస్సాకు, గోకవరం అధ్యక్షులు సుబ్బారావు, గండేపల్లి అధ్యక్షులు శ్రీనివాస్, కిర్లంపూడి నుండి ప్రతాప్, దేవి, లక్ష్మి మరియు నియోజకవర్గం లో ఉన్న వి ఆర్ ఎ లు అందరూ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వీఆర్ఏ లు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా జీతం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వస్తున్న 10 వేల 500 రూపాయల జీతంతో నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో కుటుంబ పోషణ భారంగా మారిందని, అర్ధాకలితో పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. గత 10 రోజులుగా తహసిల్దార్ కార్యాలయాల వద్ద టెంట్లు వేసుకుని నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు.వారి ప్రధాన డిమాండ్లు: 1. వేతన సవరణ అమలు చేయాలి 2. నామినీ వీఆర్ఏ లను రెగ్యులర్ చేయాలి 3. అర్హత కలిగిన వీఆర్ఏ లకు పదోన్నతులు కల్పించాలి దీనిపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ మీ న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇస్సాకు, కార్యదర్శి మౌళి, పెద్దాపురం డివిజన్ ఉపాధ్యక్షులు చిట్టిబాబు, మండల జాయింట్ కార్యదర్శి ప్రభావతి, ఉపాధ్యక్షులు అర్జునుడు, మండల వీఆర్ఏ లు పాల్గొన్నారు.

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 26 :
వీఆర్ఏ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి పిలుపు మేరకు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా 11 వ రోజు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, గోకవరం మండలాల వీఆర్ఏ లు సమ్మెను కొనసాగిస్తున్నారు.
శనివారంకాకినాడ జిల్లా వి ఆర్ ఎ ల సంఘం అధ్యక్షులు నిడమర్తి సురేష్ఇశ్రాయేలు ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం లో గల నాలుగు మండలాలు జగ్గంపేట, గోకవరం, గండేపల్లి, కిర్లంపూడి మాడలాల వి ఆర్ ఎ లు జగ్గంపేట ఎమ్మార్వో కార్యాలయం నుండి రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించుకుంటూ వచ్చి జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో జగ్గంపేట మండలం అధ్యక్షులు ఇస్సాకు, గోకవరం అధ్యక్షులు సుబ్బారావు, గండేపల్లి అధ్యక్షులు శ్రీనివాస్, కిర్లంపూడి నుండి ప్రతాప్, దేవి, లక్ష్మి మరియు నియోజకవర్గం లో ఉన్న వి ఆర్ ఎ లు అందరూ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వీఆర్ఏ లు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా జీతం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వస్తున్న 10 వేల 500 రూపాయల జీతంతో నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో కుటుంబ పోషణ భారంగా మారిందని, అర్ధాకలితో పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. గత 10 రోజులుగా తహసిల్దార్ కార్యాలయాల వద్ద టెంట్లు వేసుకుని నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు.వారి ప్రధాన డిమాండ్లు:
1. వేతన సవరణ అమలు చేయాలి
2. నామినీ వీఆర్ఏ లను రెగ్యులర్ చేయాలి
3. అర్హత కలిగిన వీఆర్ఏ లకు పదోన్నతులు కల్పించాలి
దీనిపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ మీ న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇస్సాకు, కార్యదర్శి మౌళి, పెద్దాపురం డివిజన్ ఉపాధ్యక్షులు చిట్టిబాబు, మండల జాయింట్ కార్యదర్శి ప్రభావతి, ఉపాధ్యక్షులు అర్జునుడు, మండల వీఆర్ఏ లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.