“డ్రగ్స్ వద్దు బ్రో”.. నెల్లూరులో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
SPS నెల్లూరు జిల్లా, 08.05.2026: నెల్లూరు జిల్లాను డ్రగ్-ఫ్రీ జిల్లాగా మార్చేందుకు జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో స్కూళ్లు, కాలేజీల్లో ఏర్పాటు చేసిన ఈగల్ క్లబ్స్ ద్వారా విద్యార్థులు, యువతలో చైతన్యం కల్పిస్తున్నారు. డ్రగ్స్ వినియోగం ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును నాశనం చేస్తుందని అధికారులు హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా రెండూ చట్టరీత్యా నేరాలని స్పష్టం చేశారు. అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే 112 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరారు.

డ్రగ్స్ వద్దు బ్రో”.. నెల్లూరులో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
“డ్రగ్స్ వద్దు బ్రో”.. నెల్లూరులో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు SPS నెల్లూరు జిల్లా, 08.05.2026: నెల్లూరు జిల్లాను డ్రగ్-ఫ్రీ జిల్లాగా మార్చేందుకు జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో స్కూళ్లు, కాలేజీల్లో ఏర్పాటు చేసిన ఈగల్ క్లబ్స్ ద్వారా విద్యార్థులు, యువతలో చైతన్యం కల్పిస్తున్నారు. డ్రగ్స్ వినియోగం ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును నాశనం చేస్తుందని అధికారులు హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా రెండూ చట్టరీత్యా నేరాలని స్పష్టం చేశారు. అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే 112 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరారు.

