Saturday, 5 September 2026
  • Home  
  • జోనల్ బాక్సింగ్ ఛాంపియన్‌గా ఆత్మకూరు అకాడమీ
- నంద్యాల

జోనల్ బాక్సింగ్ ఛాంపియన్‌గా ఆత్మకూరు అకాడమీ

నంద్యాల: జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక మధుమణి ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన ఇంటర్ జోనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆత్మకూరు బాక్సింగ్ అకాడమీ విజేతగా నిలవగా, బనగానపల్లి జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. విజేతలకు అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, లీగల్ అడ్వైజర్ ఆలీ హుస్సేన్ ట్రోఫీలు, పతకాలు అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ.. నిరంతర సాధన, క్రమశిక్షణతోనే క్రీడల్లో విజయాలు సాధించవచ్చని అన్నారు. త్వరలోనే నంద్యాలలో రాష్ట్రస్థాయి పోటీలు, శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి ఛాంపియన్‌షిప్‌లో నంద్యాల జిల్లా మూడో స్థానం సాధించిందని గుర్తు చేస్తూ క్రీడలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పోటీల్లో లక్ష్మి దీపక్ ‘బెస్ట్ బాక్సర్’ అవార్డు గెలుచుకోగా, వివిధ విభాగాల్లో సుమంత్, ప్రణతి, హర్ష, శృతి, జె.మహమ్మద్ గౌస్, దేవి, ధనుష్, యుగంధర్, చిరంజీవి స్వర్ణ పతకాలు సాధించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.