Thursday, 3 September 2026
  • Home  
  • జీతం అమలు చేసే వరకు రీ సర్వే చేయలేము: తెలంగాణ లైసెన్స్ సర్వేయర్లు
- E-పేపర్ - తెలంగాణ - మహబూబాబాద్

జీతం అమలు చేసే వరకు రీ సర్వే చేయలేము: తెలంగాణ లైసెన్స్ సర్వేయర్లు

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ లైసెన్స్‌డ్ సర్వేయర్లకు నెలకు ₹30,000 స్థిర వేతనం మంజూరు చేయవలసిందిగా టిఆర్ఎస్ పార్టీ తరఫున మీ సహకారం ఉండాలని మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారికి వినతి పత్రం సమర్పించారుతెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టం అమలులో భాగంగా ప్రభుత్వం శిక్షణ ఇచ్చి సుమారు 6,500 మంది రెవెన్యూ లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించింది. ప్రభుత్వ భూ సర్వే కార్యక్రమాల్లో మరియు ప్రజలకు భూ సంబంధిత సేవలు అందించడంలో లైసెన్స్‌డ్ సర్వేయర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.అయితే ప్రస్తుతం మాకు ఎకరాకు కమిషన్ ఆధారంగా చెల్లిస్తున్న పారితోషికం మాత్రమే ఉండటంతో స్థిరమైన ఆదాయం లేకుండా పోయింది. ఫీల్డ్‌లో ఎండ, వర్షం వంటి ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తూ, ప్రయాణ ఖర్చులు మరియు ఇతర ఖర్చులు భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం అందుతున్న పారితోషికం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదు.కావున ఎకరాకు కమిషన్ ఆధారిత విధానాన్ని రద్దు చేసి, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ లైసెన్స్‌డ్ సర్వేయర్లకు నెలకు కనీసం ₹30,000/- స్థిర వేతనం (గౌరవ వేతనం) ప్రభుత్వం మంజూరు చేయాలని మా ప్రధాన డిమాండ్.అదేవిధంగా లైసెన్స్‌డ్ సర్వేయర్లకు పని భద్రత కల్పించి, అనవసరంగా లైసెన్సులు రద్దు చేయకుండా, రద్దు చేసిన లైసెన్సులను పునఃపరిశీలించి న్యాయం చేయాలని మనవి.కావున మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, 6,500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు నెలకు ₹30,000 స్థిర వేతనం మంజూరు చేసేలా మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరారుతెలంగాణ రెవెన్యూ లైసెన్స్‌డ్ సర్వేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నగర రమేష్, ప్రధాన కార్యదర్శి కొమ్ముషేకర్, రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ, దుబ్బ గోవర్ధన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గుండుకాడి ప్రశాంత్, జిల్లా కన్వీనర్ కర్నల నరేష్ తాదిరులు కలిశారు


తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ లైసెన్స్‌డ్ సర్వేయర్లకు నెలకు ₹30,000 స్థిర వేతనం మంజూరు చేయవలసిందిగా టిఆర్ఎస్ పార్టీ తరఫున మీ సహకారం ఉండాలని
మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారికి వినతి పత్రం సమర్పించారు
తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టం అమలులో భాగంగా ప్రభుత్వం శిక్షణ ఇచ్చి సుమారు 6,500 మంది రెవెన్యూ లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించింది. ప్రభుత్వ భూ సర్వే కార్యక్రమాల్లో మరియు ప్రజలకు భూ సంబంధిత సేవలు అందించడంలో లైసెన్స్‌డ్ సర్వేయర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే ప్రస్తుతం మాకు ఎకరాకు కమిషన్ ఆధారంగా చెల్లిస్తున్న పారితోషికం మాత్రమే ఉండటంతో స్థిరమైన ఆదాయం లేకుండా పోయింది. ఫీల్డ్‌లో ఎండ, వర్షం వంటి ప్రతికూల పరిస్థితుల్లో పనిచేస్తూ, ప్రయాణ ఖర్చులు మరియు ఇతర ఖర్చులు భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం అందుతున్న పారితోషికం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదు.
కావున ఎకరాకు కమిషన్ ఆధారిత విధానాన్ని రద్దు చేసి, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ లైసెన్స్‌డ్ సర్వేయర్లకు నెలకు కనీసం ₹30,000/- స్థిర వేతనం (గౌరవ వేతనం) ప్రభుత్వం మంజూరు చేయాలని మా ప్రధాన డిమాండ్.
అదేవిధంగా లైసెన్స్‌డ్ సర్వేయర్లకు పని భద్రత కల్పించి, అనవసరంగా లైసెన్సులు రద్దు చేయకుండా, రద్దు చేసిన లైసెన్సులను పునఃపరిశీలించి న్యాయం చేయాలని మనవి.
కావున మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, 6,500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు నెలకు ₹30,000 స్థిర వేతనం మంజూరు చేసేలా మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరారు
తెలంగాణ రెవెన్యూ లైసెన్స్‌డ్ సర్వేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నగర రమేష్, ప్రధాన కార్యదర్శి కొమ్ముషేకర్, రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ, దుబ్బ గోవర్ధన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గుండుకాడి ప్రశాంత్, జిల్లా కన్వీనర్ కర్నల నరేష్ తాదిరులు కలిశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.