చిత్తూరు జిల్లా కే కాక రాయలసీమ లోని పలు జిల్లాల మై భారత్ కి మల్లకుంట చినబాబు రెడ్డి బంగారు ఆభరణం అని పలువురు కొని యాడారు.
చిత్తూరు,కడప మై భారత్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా చిత్తూరు లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర మై భారత్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సమక్షంలో ఘనంగా సత్కరించారు. చిత్తూరు జిల్లా కో ఆర్డినేటర్ ప్రదీప్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గత నాలుగు దశాబ్దాలుగా బాబు రెడ్డి వివిధ ప్రాంతాల లో చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొని కొనియాడారు. విధి నిర్వహణ కి అంకితమైన బాబు రెడ్డి ఉద్యోగ విరమణ మై భారత్ కు తీరని లోటని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా చిత్తూరులో సేవలు అందిస్తూ మంచి పేరు సాధించారని తెలిపారు. విశ్రాంత నెహ్రూ యువ కేంద్ర ఆర్.సి బాల్డ్విన్ రాజు తర్వాత బాబు రెడ్డి తన సేవలతో అంతటి పేరు తెచ్చుకున్నారని సన్మాన సభలో పాల్గొన్న ఎ.పి.తెలంగాణ విశ్రాంత జోనల్ డైరెక్టర్ నటరాజన్, విశ్రాంత ఎ.పి.స్టేట్ డైరెక్టర్ వెంకటేశమ్, బి.జె.ప్రసన్న, పి.సి.స్వామి, శ్రీకాకుళం విశ్రాంత వై.సి కి.వెంకటరమణలు పేర్కొన్నారు. నెల్లూరు లో తొలిసారిగా విధులు చేపట్టిన బాబు రెడ్డి అంకిత భావం తో చివరి వరకు సేవలు అందిస్తూ యన్.వై.కి ప్రగతికి నిరంతరం అందించిన సేవల ఫలితమే ఇంత ఘనంగా ఉద్యోగ విరమణ సభ అని అభినందించారు. ఒకే శాఖ లో బాబు రెడ్డి, విజయా రావు దంపతులు వివిధ హోదాల్లో విజయవంతం గా పనిచేసి విరమణ చేయడం ఉభయ తెలుగు రాష్ట్రా లలో కొత్త రికార్డు అని కొనియాడారు. చిత్తూరు వై.సి ప్రదీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ కె. వెంకటఉజ్వల్ మాట్లాడుతూ అకౌంట్స్ ఆఫీసర్ గా బాబు రెడ్డి, స్టేట్ డైరెక్టర్ గా విజయా రావు లు ఉభయ తెలుగు రాష్ట్రా లలో యువతకు మహిళా సంఘాల కు చేసిన సేవలు అద్భుతమైనవని అని, ఇప్పటికి ఏ ప్రాంతం పోయినా మిడిల్ జనరేషన్ లో వారి పేర్లు వినిపిస్తున్నాయని, వారు లేక పోవడం నేడు మై భారత్ కు తీరని లోటని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ చేసినా వారి సూచనలు తమకు అందించాలని, తమ తండ్రి వెంకటరమణ తో కలిసి పని చేసిన యన్ వై కె టీం అండగా ఉండాలని కోరారు. శ్రీమతి విజయా బాబు రెడ్డి మాట్లాడుతూ తనకు భగవంతుడు బాబు రెడ్డి తో కలిపి మంచి కుటుంబం ఇచ్చారని జీవితం ప్రశాంతంగా సాగుతోంది అని తెలిపారు.ఈ సందర్భంగా బాబు రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు లో విధులు చేపట్టినప్పటి నుంచి తనకు ప్రతి జిల్లాలో అందరూ సహకరించారని తనకంటూ శత్రువులు ఎవరూ లేరని, తన తల్లి తండ్రులు, పెద్దమ్మ పెద్దనాన్న లు మంచి ఆలోచన లతో తమను పెంచారని, వారు పడిన కష్టంతో నే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు.. కార్యక్రమం లో ఏసయ్య, డాక్టర్ హరి నాయుడు,
జ్ఞాన శేఖర్ రెడ్డి, జయప్రతాప్ రెడ్డి (నెల్లూరు) వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యాలయ సిబ్బంది సత్కరించారు. కుమార్తె దుర్గా మాధురి, కుమారుడు అఖిల్, తమ్ముడు అనిల్ బాబు రెడ్డి ఉద్యోగ విరమణ తో ఆయన ఇక ఎక్కువ సమయం కుటుంబం తో గడిపే అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు



