ఖమ్మం
(పున్నమి న్యూస్ )
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (బాలయ్య)తో ఖమ్మానికి చెందిన అభిమాన నాయకుడు నల్లమల్ల రంజిత్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా బాలయ్య ఆరోగ్య పరిస్థితిని రంజిత్ అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల జరిగిన సంఘటన తనతో పాటు అభిమానులందరినీ తీవ్రంగా కలచివేసిందని రంజిత్ తెలిపారు. బాలయ్య త్వరగా కోలుకోవాలని ఖమ్మంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా చేపట్టామని వివరించారు.
దీనికి స్పందించిన బాలయ్య, ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యుల సూచన మేరకు మూడు వారాలు విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారు. అలాగే ఖమ్మంలోని తన అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.
అదే సమయంలో నల్లమల్ల రంజిత్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను కూడా బాలయ్య ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ ఫోన్ సంభాషణతో ఖమ్మం జిల్లాలోని బాలయ్య అభిమానుల్లో ఆనందం నెలకొంది.

