బిజినేపల్లిలో ఉత్సాహంగా సాగిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఆదివారం జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో మంగనూర్ జట్టు రన్నరప్‌గా నిలిచి, ద్వితీయ బహుమతిని సొంతం చేసుకుంది. టోర్నీ పొడుగునా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న మంగనూర్ ఆటగాళ్లు ఫైనల్లో గట్టి పోటీ ఇచ్చారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ప్రతిభ చాటిన ఆటగాళ్లను, మంగనూర్ జట్టును గ్రామస్తులు, క్రీడాభిమానులు ప్రత్యేకంగా అభినందించారు



