Monday, 13 July 2026
  • Home  
  • చంద్రబాబు ప్రభుత్వంపై కాకాణి విమర్శలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చంద్రబాబు ప్రభుత్వంపై కాకాణి విమర్శలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 12 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం చెముడుగుంటలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఇటీవల వివాహం చేసుకున్న పార్టీ కార్యకర్తలు శ్రవంతి–తరుణ్ దంపతులను ఆయన ఆశీర్వదించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాకాణి, 25 నెలలు గడిచినా ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. సీపీఎస్, జీపీఎస్, పీఆర్సీ, ఐఆర్ అంశాల్లో ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. డీఏలు, అరియర్లు, మెడికల్ బిల్లులు, రిటైర్మెంట్ ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. మాజీ డీసీసీబీ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.