ఘనంగా యువ నాయకులు బండారు సంజీవ్ జన్మదిన వేడుకలు
పేదలకు స్వీట్లు, దుపట్లు పంపిణి
*స్కూలు పిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపిణీ
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తనయుడు, యువ నాయకులు బండారు సంజీవ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాడపాలెం గ్రామంలో అభిమానులు కేక్ కటింగ్ నిర్వహించారు. పేదలకు స్వీట్స్ మరియు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ పుట్టినరోజును పురస్కరించుకుని వాడపాలెం గ్రామ దేవత మారెమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి బండారు రాజేష్ సమకూర్చిన 50 వేల రూపాయలను సంజీవ్ చేతుల మీదుగా ఆలయ కమిటీ వారికి అందజేశారు. నేడు పుట్టిన రోజు జరుపుకున్న బండారు సంజీవ్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.



