Monday, 8 June 2026
  • Home  
  • గ్రావెల్ తరలింపు పై చర్యలు తీసుకోరా . మాజీ యమ్ యల్ ఎ ప్రతాప్ రెడ్డి ధ్వజం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గ్రావెల్ తరలింపు పై చర్యలు తీసుకోరా . మాజీ యమ్ యల్ ఎ ప్రతాప్ రెడ్డి ధ్వజం

కావలి నియోజకవర్గం లో కూటమి ప్రభుత్వం చేస్తున్న గ్రావెల్ అక్రమ దందాపై చర్యలు చేపట్టరా అంటూ ఆర్డిఓ డి ఎలిషాను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. . వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో కి వినతి పత్రం అందజేశారు. దీనికి ముందుగా ఆర్డీవో మాట్లాడుతూ తనకు సమయం లేదని వీసీ జరుగుతుందని ఒంటిగంట తరువాత దానిపై మాట్లాడతానని తెలుపగా. దీనిపై మాజీ ఎమ్మెల్యే స్పందిస్తూ స్వయంగా తానే కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోరా గ్రీవెన్స్ డే రోజు అర్జీ ఇస్తామంటే తీసుకోరా అని ఆర్డిఓను నిలదీశారు. కావలి పట్టణంలో మండలాల్లో వివిధ ప్రాంతాల్లో చేస్తున్న అక్రమ మైనింగ్ గ్రావెల్ మట్టి మాఫియా యదేచ్ఛగా పట్టపగలు తవ్వకాలు చేస్తుంటే స్వయంగా తానే ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ గత మూడు రోజులైనా పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. ప్రజలను ప్రభుత్వాస్తులను కాపాడాల్సిన అధికారులే దళారుల కు అమ్ముడుపోయి వ్యవస్థలను పాడు చేయటం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖ వారు తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తే వారు ఏ స్థాయిలో అవినీతిలో కోరుకుపోయారో అర్థం అవుతుందని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించకుంటే త్వరలో వైసిపి పార్టీ కేడర్ మొత్తం స్పాట్లోకి వచ్చి అడ్డుకుంటామని, తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ప్రతాప్ రెడ్డి అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. జిల్లా లో అధికార యంత్రాంగం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు.తరలిపోతున్న గ్రావెల్ కు ఆధారాలు చూపుతున్నా స్పందన లభించకపోవడం పై అసహనం వ్యక్తం చేశారు.

కావలి నియోజకవర్గం లో కూటమి ప్రభుత్వం చేస్తున్న గ్రావెల్ అక్రమ దందాపై చర్యలు చేపట్టరా అంటూ ఆర్డిఓ డి ఎలిషాను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
. వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో కి వినతి పత్రం అందజేశారు. దీనికి ముందుగా ఆర్డీవో మాట్లాడుతూ తనకు సమయం లేదని వీసీ జరుగుతుందని ఒంటిగంట తరువాత దానిపై మాట్లాడతానని తెలుపగా. దీనిపై మాజీ ఎమ్మెల్యే స్పందిస్తూ స్వయంగా తానే కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోరా గ్రీవెన్స్ డే రోజు అర్జీ ఇస్తామంటే తీసుకోరా అని ఆర్డిఓను నిలదీశారు. కావలి పట్టణంలో మండలాల్లో వివిధ ప్రాంతాల్లో చేస్తున్న అక్రమ మైనింగ్ గ్రావెల్ మట్టి మాఫియా యదేచ్ఛగా పట్టపగలు తవ్వకాలు చేస్తుంటే స్వయంగా తానే ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ గత మూడు రోజులైనా పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. ప్రజలను ప్రభుత్వాస్తులను కాపాడాల్సిన అధికారులే దళారుల కు అమ్ముడుపోయి వ్యవస్థలను పాడు చేయటం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖ వారు తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తే వారు ఏ స్థాయిలో అవినీతిలో కోరుకుపోయారో అర్థం అవుతుందని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించకుంటే త్వరలో వైసిపి పార్టీ కేడర్ మొత్తం స్పాట్లోకి వచ్చి అడ్డుకుంటామని, తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ప్రతాప్ రెడ్డి అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. జిల్లా లో అధికార యంత్రాంగం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు.తరలిపోతున్న గ్రావెల్ కు ఆధారాలు చూపుతున్నా స్పందన లభించకపోవడం పై అసహనం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.