పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) జనవరి 05 : మహేశ్వరం నియోజకవర్గం అల్మాస్గూడ గ్రామ పరిధి, వైస్సార్ పార్క్ అంబెడ్కర్ చౌరస్తా నుండి కోమటి కుంట చెరువు వరకు పెద్ద డ్రైనేజి పైప్ లైన్ కోసం దాదాపు 25 లక్షల రూపాయల మున్సిపల్ నిధులు మంజూరు చేసి గత నెల రోజుల క్రితం పనులు మొదలు పెట్టి వివిధ కారణాల వల్ల డ్రైనేజి పనులు మధ్యలో ఆపేయటంతో స్థానిక కాలనీల ప్రజలు , వాహన దారులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ సమస్యని బడంగ్ పేట్ సర్కిల్ అధికారుల దృష్టికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీ వాసులతో కలసి సోమవారం సర్కిల్ ఏఈ హరీష్ వర్క్ ఇన్స్పెక్టర్ వినయ్ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. వెంటనే స్పందించిన అధికారు మాతో పాటు వచ్చి డ్రైనేజి సమస్య తీవ్రతని చూసి వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ ని పిలిపించి పనులు ప్రారంభించటం జరిగింది.ఈ డ్రైనేజి మరమ్మత్తుల పనులు మధ్యలో ఆపకుండా పూర్తి చేసి సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులని కోరటం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి దిండు శ్రీను గౌడ్ చంద్రం చంటి జగన్ లక్ష్మయ్య గౌడ్ షైన్ వర్గీస్ నరేష్ చారి సునీల్ రామలింగం తదితరులున్నారు .



