Saturday, 3 October 2026
  • Home  
  • గాంధీ–శాస్త్రి ఆశయాలతో యువత ర్యాలీ
- అనకాపల్లి

గాంధీ–శాస్త్రి ఆశయాలతో యువత ర్యాలీ

కొక్కిరాపల్లిలో ఘనంగా జయంతి వేడుకలు.. పర్యావరణం, పరిశుభ్రతపై అవగాహన పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) యలమంచిలి: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు కొక్కిరాపల్లిలో గ్రామ జ్యోతి యువత ఆధ్వర్యంలో, పూర్ణ సాయి వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థుల సహకారంతో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వివేకానంద రీడింగ్ బుక్స్ వద్ద గ్రామ పెద్దలు భైరవభట్ల శివరాం, విశ్రాంత ఉపాధ్యాయులు అబ్దుల్ మాస్టర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివరాం మాట్లాడుతూ గాంధీజీ సత్యం, శాంతి, అహింస మార్గాలతో స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు. శాస్త్రి నిరాడంబరత, నిజాయితీకి ప్రతీకగా నిలిచారని, ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదంతో సైనికులు, రైతుల ప్రాధాన్యతను చాటిచెప్పారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు, యువత గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణ, ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, గ్రామ జ్యోతి యువత ప్రతినిధులు, కళాశాల విద్యార్థులు, గ్రామ పెద్దలు, చిన్నారులు పాల్గొన్నారు.

కొక్కిరాపల్లిలో ఘనంగా జయంతి వేడుకలు.. పర్యావరణం, పరిశుభ్రతపై అవగాహన

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)

యలమంచిలి: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు కొక్కిరాపల్లిలో గ్రామ జ్యోతి యువత ఆధ్వర్యంలో, పూర్ణ సాయి వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థుల సహకారంతో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వివేకానంద రీడింగ్ బుక్స్ వద్ద గ్రామ పెద్దలు భైరవభట్ల శివరాం, విశ్రాంత ఉపాధ్యాయులు అబ్దుల్ మాస్టర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివరాం మాట్లాడుతూ గాంధీజీ సత్యం, శాంతి, అహింస మార్గాలతో స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు. శాస్త్రి నిరాడంబరత, నిజాయితీకి ప్రతీకగా నిలిచారని, ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదంతో సైనికులు, రైతుల ప్రాధాన్యతను చాటిచెప్పారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు, యువత గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణ, ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, గ్రామ జ్యోతి యువత ప్రతినిధులు, కళాశాల విద్యార్థులు, గ్రామ పెద్దలు, చిన్నారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.