గ్రామసభ తీర్మానం మేరకు ఆలయ నిర్మాణానికి సహకరించాలి టీడీపీ మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య
ఒంటిమిట్ట గ్రామ నడిబొడ్డున ఉన్న శ్రీ గంగమ్మ దేవత ఆలయ నిర్మాణానికి గ్రామసభ కేటాయించిన స్థలంపై ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఆలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని రాష్ట్ర మాజీ డైరెక్టర్, ఒంటిమిట్ట మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకుడు కొమర వెంకట నరసయ్య కోరారు. ఒంటిమిట్టలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులు మామిళ్ల ఈశ్వరయ్య, పామూరు సుబ్రమణ్యంతో కలిసి ఆయన మాట్లాడారు. 2004లో అప్పటి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కీర్తిశేషులు పసుపులేటి బ్రహ్మయ్య హాజరైన ఒంటిమిట్ట గ్రామపంచాయతీ గ్రామసభలో శ్రీ గంగమ్మ దేవత ఆలయ నిర్మాణంతో పాటు ఒంటిమిట్ట బజారు వీధిలో సాయిబాబా దేవాలయ నిర్మాణానికి గ్రామకంఠం భూమిలో ఐదేసి సెంట్ల చొప్పున స్థలం కేటాయించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు వెంకట నరసయ్య తెలిపారు.గ్రామసభ తీర్మానం మేరకు అప్పటి నుంచే ఆలయాల నిర్మాణానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో సాయిబాబా ఆలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అంగన్వాడీ కేంద్రం నిర్మించేందుకు కొందరు అప్పటి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారని ఆరోపించారు. దీనిపై ఒంటిమిట్ట మండల టీడీపీ సీనియర్ నాయకుడు మోదుగుల పెంచలయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో నిర్మాణం నిలిచిపోయిందని వివరించారు.అదేవిధంగా 2014లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో గంగమ్మ దేవాలయానికి స్థలం కేటాయించినట్లు తెలిపారు. అయితే ఆ స్థలంలో కొందరు అక్రమంగా రేకుల షెడ్డు నిర్మించగా గ్రామస్తులంతా కలిసి దానిని తొలగించినట్లు చెప్పారు. గ్రామసభ తీర్మానం ద్వారా దేవాలయాల నిర్మాణానికి కేటాయించిన స్థలాలను ఇతర అవసరాలకు వినియోగించకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.గంగమ్మ దేవత ఆలయ నిర్మాణాన్ని కొందరు అడ్డుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసినట్లు వెంకట నరసయ్య తెలిపారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు ఎమ్మార్వో, ఎంపీడీవో, పంచాయతీరాజ్ ఏఈలతో కూడిన త్రిసభ్య కమిటీ స్థలాన్ని పరిశీలించి, గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేవని నివేదిక సమర్పించినట్లు పేర్కొన్నారు.
త్రిసభ్య కమిటీ నివేదికను జిల్లా కలెక్టర్ వెంటనే ఆమోదించి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గంగమ్మ గుడి స్థల సమస్యను రాజకీయంగా మార్చేందుకు కొందరు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు.
గ్రామ ప్రజల మనోభావాలను గౌరవించి, గ్రామసభ తీర్మానం మేరకు సమస్యను పరిష్కరించాలని కోరారు. గ్రామ పెద్దల అనుమతి, గ్రామ ప్రజల సహకారంతో శ్రీ గంగమ్మ దేవత ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్య మరింత జఠిలం కాకుండా జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి గ్రామసభ కేటాయించిన స్థలంపై తగిన నిర్ణయం తీసుకోవాలని కొమర వెంకట నరసయ్య, మామిళ్ల ఈశ్వరయ్య, పామూరు సుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు.

గంగమ్మ గుడి స్థలంపై వివాదాలు వద్దు
గ్రామసభ తీర్మానం మేరకు ఆలయ నిర్మాణానికి సహకరించాలి టీడీపీ మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య ఒంటిమిట్ట గ్రామ నడిబొడ్డున ఉన్న శ్రీ గంగమ్మ దేవత ఆలయ నిర్మాణానికి గ్రామసభ కేటాయించిన స్థలంపై ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఆలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని రాష్ట్ర మాజీ డైరెక్టర్, ఒంటిమిట్ట మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకుడు కొమర వెంకట నరసయ్య కోరారు. ఒంటిమిట్టలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీనియర్ నాయకులు మామిళ్ల ఈశ్వరయ్య, పామూరు సుబ్రమణ్యంతో కలిసి ఆయన మాట్లాడారు. 2004లో అప్పటి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కీర్తిశేషులు పసుపులేటి బ్రహ్మయ్య హాజరైన ఒంటిమిట్ట గ్రామపంచాయతీ గ్రామసభలో శ్రీ గంగమ్మ దేవత ఆలయ నిర్మాణంతో పాటు ఒంటిమిట్ట బజారు వీధిలో సాయిబాబా దేవాలయ నిర్మాణానికి గ్రామకంఠం భూమిలో ఐదేసి సెంట్ల చొప్పున స్థలం కేటాయించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు వెంకట నరసయ్య తెలిపారు.గ్రామసభ తీర్మానం మేరకు అప్పటి నుంచే ఆలయాల నిర్మాణానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో సాయిబాబా ఆలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అంగన్వాడీ కేంద్రం నిర్మించేందుకు కొందరు అప్పటి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారని ఆరోపించారు. దీనిపై ఒంటిమిట్ట మండల టీడీపీ సీనియర్ నాయకుడు మోదుగుల పెంచలయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో నిర్మాణం నిలిచిపోయిందని వివరించారు.అదేవిధంగా 2014లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో గంగమ్మ దేవాలయానికి స్థలం కేటాయించినట్లు తెలిపారు. అయితే ఆ స్థలంలో కొందరు అక్రమంగా రేకుల షెడ్డు నిర్మించగా గ్రామస్తులంతా కలిసి దానిని తొలగించినట్లు చెప్పారు. గ్రామసభ తీర్మానం ద్వారా దేవాలయాల నిర్మాణానికి కేటాయించిన స్థలాలను ఇతర అవసరాలకు వినియోగించకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.గంగమ్మ దేవత ఆలయ నిర్మాణాన్ని కొందరు అడ్డుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసినట్లు వెంకట నరసయ్య తెలిపారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు ఎమ్మార్వో, ఎంపీడీవో, పంచాయతీరాజ్ ఏఈలతో కూడిన త్రిసభ్య కమిటీ స్థలాన్ని పరిశీలించి, గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేవని నివేదిక సమర్పించినట్లు పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ నివేదికను జిల్లా కలెక్టర్ వెంటనే ఆమోదించి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గంగమ్మ గుడి స్థల సమస్యను రాజకీయంగా మార్చేందుకు కొందరు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. గ్రామ ప్రజల మనోభావాలను గౌరవించి, గ్రామసభ తీర్మానం మేరకు సమస్యను పరిష్కరించాలని కోరారు. గ్రామ పెద్దల అనుమతి, గ్రామ ప్రజల సహకారంతో శ్రీ గంగమ్మ దేవత ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్య మరింత జఠిలం కాకుండా జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి గ్రామసభ కేటాయించిన స్థలంపై తగిన నిర్ణయం తీసుకోవాలని కొమర వెంకట నరసయ్య, మామిళ్ల ఈశ్వరయ్య, పామూరు సుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు.

