మరో పక్షం రోజుల్లో అధ్యక్షుడిగా పదవీకాలం ముగుస్తున్న తరుణంలో కావలి రోటరీ అధ్యక్షుడు అంకినపల్లి రమేష్ రెడ్డి రోటరీ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు. శనివారం
కావలి రెడ్ క్రాస్ భవనంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలికలకు ఉచిత క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్ కార్యక్రమంలో 1150 మంది బాలికలకు అందించారు. కిషోర బాలికలకు భవిష్యత్తులో ఇలాంటి గర్భకోశ వ్యాధి క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక మొండి వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో ఉచితంగా ఇచ్చిన వాటిలో కావలి రెండవది కావడం విశేషం. 2500 రూపాయలు చేసే ఒక్కొక్క వ్యాక్సిన్ ను కావలి లో లభింపచేయడంలో రోటరీ పెద్దల సహకారంతో పాటు రమేష్ రెడ్డి గవర్నర్ కూరపాటి మాధవరెడ్డి చేసిన కృషితో స్వచ్ఛందంగా దాతలు ముందుకు రావడంతో భారీ ఎత్తున వ్యాక్సిన్ శిబిరం నిర్వహించారు .రాష్ట్రంలో తాడేపల్లి తర్వాత ఇంత ఎత్తున వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత కావలి రోటరీ క్లబ్ కి దక్కింది. రోటరీ అధ్యక్షుడిగా గత ఏడాది జూలైలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రమేష్ రెడ్డి వినూత్నంగా సేవలందిస్తూ మందగించిన రోటరీ చక్రానికి వేగం పెంచారు. ఈ క్రమంలో ఆయన ఏడాదిగా చేపట్టిన ఎన్నో సేవా కార్యక్రమాలు కావలి రోటరీ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి.ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన యమ్ యల్ ఎ కృష్ణారెడ్డి, ఆర్ డి ఓ ఎలీషా, రోటరీ గవర్నర్ రవీంద్ర, రోటరీ పెద్దలు భరత్ రెడ్డి, తదితరులు కావలి రోటరీ అందించిన సేవలు అద్భుతమైనవని ప్రశంసించారు. సేవలందించే క్రమంలో గవర్నర్ మాధవరెడ్డి అధ్యక్షుడు రమేష్ రెడ్డి చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు .ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ రమేష్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వినూత్నంగా సేవలను కావలి రోటరీ అందించాలంటూ ఆరాటపడ్డారని, ఆ క్రమంలో ఈ వ్యాక్సిన్ ఏర్పాటు విషయమై ఆయన చూపిన చొరవ తమకు కంటిమీద కునుకు లేకుండా చేసిందని కొనియాడారు. అధ్యక్షుడు రమేష్ రెడ్డి మాట్లాడుతూ చేపట్టిన పదవికి నిజాయితీగా సేవలందించాలని ఆశ తప్ప మరొకటి తానకు లేదని ఈ వ్యాక్సిన్ ఏర్పాట్లలో సహకరించిన రోటరీ పెద్దలకు ఐఎంఏ వైద్యులకు రెడ్ క్రాస్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.కావలిలో సుమారు 13,000 మంది బాలికలు ఉన్నారని వారందరికీ దశలవారీగా వ్యాక్సిన్ అందించాల్సి ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థినులకు ఇబ్బంది లేకుండా వ్యాక్సిన్ వేయడం ఒక ఎత్తు కాగా వారికి సదుపాయాలు కల్పించడంలో రోటరీ సభ్యులు విశేష కృషి చేశారు. క్యాంపుకు వచ్చిన విద్యార్థులతో పాటు వచ్చిన వారందరికీ రోటరీ ప్రతినిధులు హరికృష్ణా రెడ్డి, ప్రతాప్ రెడ్డి ,వెంకటేశ్వర్లు రెడ్డి ప్రతిక్షణం మంచినీరు మజ్జిగ ఆహారం సదుపాయాలను అందజేయడంతో పాటు వ్యాక్సిన్ వేయించుకున్న బాలికలకు ధైర్యం చెబుతూ వారి చేత మజ్జిగ జ్యూస్ తాపించి శిబిరం విజయవంతం చేయడంలో కృషి చేశారు. లక్ష్మీ ఫిజియో ధెరపి కళాశాల విద్యార్థులు, ప్రిన్సిపాల్ గోపి కన్నన్ లు , డాక్టర్ రవికుమార్, డాక్టర్ రామస్వామి, డాక్టర్ బాసిం ప్రవీణ్ కుమార్, డాక్టర్ ఆనంద్ లు కీలక పాత్ర పోషించారు.



