Thursday, 3 September 2026
  • Home  
  • కామారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీజేఏ, ఎన్‌యూజే(ఐ) వినతిపత్రం
- కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీజేఏ, ఎన్‌యూజే(ఐ) వినతిపత్రం

కామారెడ్డి01సెప్టెంబర్, (, పున్నమి ప్రతినిధి ). : జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు ఎదుర్కొం టున్న వివిధ రకాల సమస్యలను పరిష్కరించాల ని, వారి సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ,తెలంగాణ జర్నలి స్ట్ అసోసియేషన్ (టీజేఏ) మరియు ఎన్‌యూజే (ఐ) కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరే ట్‌లో వినతిపత్రం సమర్పించారు. జిల్లా కలెక్టర్‌ సెలవులో ఉండటంతో, ఈ వినతిపత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) పాండు నాయక్‌కు అధికారికంగా అందజేశారు.ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య నిరంతరం వారధిలా పనిచేస్తూ, సమాజాన్ని చైతన్యపరుస్తున్న జర్నలిస్టుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని సంఘం నాయకులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.జిల్లాలోని వివిధ ముద్రణ, ఎలక్ట్రాని క్, డిజిటల్ మీడియా రంగాలలో అంకిత భావంతో పనిచేస్తున్న పాత్రికేయులు క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు స్పందించి జర్నలిస్టుల హక్కు ల పరిరక్షణకు, కుటుంబాల భద్రతకు ప్రత్యేక విధా నాన్ని అమలు చేయాలని కోరారు. ప్రధాన డిమాండ్లు మరియు సమస్యలు: అక్రిడిటేషన్ కార్డుల మంజూరు: అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఎలాంటి జాప్యం లేకుండా మీడియా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి. ప్రతి రెండు నెలలకు ఒకసారి అక్రిడిటేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు: నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన జర్నలిస్టులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి. ఆరోగ్య మరియు సంక్షేమ పథకాలు: జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే ఆరోగ్య భద్రత, ఉచిత వైద్య సేవలు మరియు సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందేలా చూడాలి. విద్యా సహాయం: జర్నలిస్టుల పిల్లల ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర పథకాల ద్వారా తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచార సమన్వయం: జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో నిర్వహించే ప్రెస్‌మీట్లు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల సమాచారాన్ని జర్నలిస్టులకు ఎప్పటిక ప్పుడు సకాలంలో అందించాలి.విధి నిర్వహ ణలో ఇబ్బందులు సృష్టించే వారిపై, సమస్య లు ఎదురైనప్పుడు అధికారుల నుంచి తగిన రక్షణ, సహకారం అందేలా ఆదేశాలు జారీ చేయాలి. ప్రత్యేక సమీక్షా సమావేశాలు: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వాటి పరిష్కారానికి అధికార యంత్రాంగం చొరవ చూపాలి. ఈ కార్యక్రమంలో ఎన్‌యూజే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు వి. రాజేందరనాథ్, టీజేఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోవర్ధన్, టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ సీఐ.హెచ్, ఉపాధ్యక్షులు ఆమృత్ రావు, వర్కింగ్ సెక్రెటరీలు మోహన్, శ్రీనివాస్ రావు, కార్యదర్శి నవీన్, కోశాధికారి సుందర్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క సిద్ది రాములు పాల్గొన్నా రు. అలాగే టీజేఏ సభ్యులు ఫర్వేజ్, రేణుకుమార్, బిక్కనూర్ సాయులు, కమ్మరి నవీన్, కుమ్మరి ఎల్లన్న, రామ్మూర్తి, కడెం భైరయ్య, టీ. సాయులు తదితర ప్రముఖ పాత్రికేయులు భారీ సంఖ్యలో హాజరై తమ నిరసనను, సంఘీభావాన్ని తెలియ జేశారు.జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం సాను కూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

కామారెడ్డి01సెప్టెంబర్, (, పున్నమి ప్రతినిధి ). : జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు ఎదుర్కొం టున్న వివిధ రకాల సమస్యలను పరిష్కరించాల ని, వారి సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ,తెలంగాణ జర్నలి స్ట్ అసోసియేషన్ (టీజేఏ) మరియు ఎన్‌యూజే (ఐ) కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరే ట్‌లో వినతిపత్రం సమర్పించారు. జిల్లా కలెక్టర్‌ సెలవులో ఉండటంతో, ఈ వినతిపత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) పాండు నాయక్‌కు అధికారికంగా అందజేశారు.ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య నిరంతరం వారధిలా పనిచేస్తూ, సమాజాన్ని చైతన్యపరుస్తున్న జర్నలిస్టుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని సంఘం నాయకులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.జిల్లాలోని వివిధ ముద్రణ, ఎలక్ట్రాని క్, డిజిటల్ మీడియా రంగాలలో అంకిత భావంతో పనిచేస్తున్న పాత్రికేయులు క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు స్పందించి జర్నలిస్టుల హక్కు ల పరిరక్షణకు, కుటుంబాల భద్రతకు ప్రత్యేక విధా నాన్ని అమలు చేయాలని కోరారు.

ప్రధాన డిమాండ్లు మరియు సమస్యలు:

అక్రిడిటేషన్ కార్డుల మంజూరు: అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఎలాంటి జాప్యం లేకుండా మీడియా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి. ప్రతి రెండు నెలలకు ఒకసారి అక్రిడిటేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి.
ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు: నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన జర్నలిస్టులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి.
ఆరోగ్య మరియు సంక్షేమ పథకాలు: జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే ఆరోగ్య భద్రత, ఉచిత వైద్య సేవలు మరియు సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందేలా చూడాలి.
విద్యా సహాయం: జర్నలిస్టుల పిల్లల ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర పథకాల ద్వారా తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.
సమాచార సమన్వయం: జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో నిర్వహించే ప్రెస్‌మీట్లు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల సమాచారాన్ని జర్నలిస్టులకు ఎప్పటిక ప్పుడు సకాలంలో అందించాలి.విధి నిర్వహ ణలో ఇబ్బందులు సృష్టించే వారిపై, సమస్య లు ఎదురైనప్పుడు అధికారుల నుంచి తగిన రక్షణ, సహకారం అందేలా ఆదేశాలు జారీ చేయాలి.
ప్రత్యేక సమీక్షా సమావేశాలు: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వాటి పరిష్కారానికి అధికార యంత్రాంగం చొరవ చూపాలి. ఈ కార్యక్రమంలో ఎన్‌యూజే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు వి. రాజేందరనాథ్, టీజేఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోవర్ధన్, టీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ సీఐ.హెచ్, ఉపాధ్యక్షులు ఆమృత్ రావు, వర్కింగ్ సెక్రెటరీలు మోహన్, శ్రీనివాస్ రావు, కార్యదర్శి నవీన్, కోశాధికారి సుందర్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క సిద్ది రాములు పాల్గొన్నా రు. అలాగే టీజేఏ సభ్యులు ఫర్వేజ్, రేణుకుమార్, బిక్కనూర్ సాయులు, కమ్మరి నవీన్, కుమ్మరి ఎల్లన్న, రామ్మూర్తి, కడెం భైరయ్య, టీ. సాయులు తదితర ప్రముఖ పాత్రికేయులు భారీ సంఖ్యలో హాజరై తమ నిరసనను, సంఘీభావాన్ని తెలియ జేశారు.జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం సాను కూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.