Tuesday, 15 July 2025
  • Home  
  • కరోనాతో చితికిపోయిన కార్మికుల బతుకులు::::: ఫయాజ్, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్
- Featured

కరోనాతో చితికిపోయిన కార్మికుల బతుకులు::::: ఫయాజ్, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్

కరోనాతో చితికిపోయిన కార్మికుల బతుకులు ఫయాజ్, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్దాదాపు రెండు నెలలుగా విధించిన లాక్ టౌన్ తో ఉదయగిరి ప్రాంతంలోని కార్మికులు పూర్తిగా చితికిపోయారు నిండా అప్పుల్లో మునిగిపోయారు చేయడానికి పని లేక, చేసే వీలు లేక కుమిలిపోయారు ఇప్పటికే మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది మళ్లీ నాలుగోసారి కూడా రెండు వారాల పాటు పొడిగించింది ఈ పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు ఇతర పనులు చేసుకునే కార్మికులు రెండు నెలలుగా పనులు లేక అల్లాడిపోయారు రాష్ట్ర ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా అందించిన బియ్యం చాలా వరకు ఆదుకుంది. ఇచ్చిన వెయ్యి రూపాయలు ఏ మూలకు సరిపోలేదు పెద్ద కుటుంబాల వారికి ఆ బియ్యం కూడా సరిపోలేదు ఈ పరిస్థితుల్లో అప్పులు చేసే పరిస్థితి ఏర్పడింది ఎక్కడ చూసినా పేద కుటుంబాల వారు నిండా అప్పుల్లో మునిగిపోయారు అసలే కరువు ప్రాంతమైన ఉదయగిరిలో కరోనా పుణ్యమని మరింత కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి కొంతమంది భవన నిర్మాణాలు రెండు వారాలు గా పనులు చేయాలని తలచినా, సిమెంటు అందుబాటులోకి రాలేదు అరకొరగా వచ్చినా ధరల పెంపుతో నిర్మాణదారులు వెనుకంజ వేశారు దీంతో పని దొరక్క బేల్దారి మేస్త్రి లు కార్మికులు కటకట లాడిపోతున్నారు ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని వేయి కళ్ళతో నిరీక్షిస్తున్నారు పని ఉందంటే చాలు ఉదయాన్నే అక్కడికి చేరుతున్నారు తీవ్ర అక్కడ ఒకరిద్దరికే పని ఉందని తెలిసి నిరాశతో వేను తిరుగుతున్నారు ఇప్పటికీ చాలా హార్డ్ వేర్ షాపులు మూసి ఉండడంతో అవసరమైన సామాగ్రి లభించడం లేదు షాపులు తెరిచేందుకు అభ్యంతరం లేదని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మరో పక్క కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్న వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. షాపులు తీసేందుకు స్థానిక అధికారులు అంగీకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం వచ్చినా దానికి తగ్గ ఆనందోత్సాహాలు లేవు. కారణం ప్రతి వారి చేతుల్లో డబ్బులు లేక పోవడమే. ఈ మాసంలో విస్తృతంగా దానధర్మాలు, ఉపవాస దీక్ష ఆచరించిన వారికి విందువినోదాలు ఇచ్చే ఆనవాయితీ ఉంది. అయితే ఈసారి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది పనులు లేక ఎవరి చేతుల్లోనూ డబ్బులు లేవు వ్యాపారుల పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు వ్యాపారాలు పూర్తిస్థాయిలో జరగకపోయినా అద్దెలు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి రావడం మరింత భారంగా మారింది పండుగకు కొత్త బట్టలు కొనేవారు కూడా కరువయ్యారు ఈసారికి ఇలా మానేసి మరో పండక్కి కొనుక్కుందాం అని తాత్విక చింతనలో మునిగిపోయారు మొత్తం మీద కరోనా ప్రభావం చాలా జీవితాల్లో నిరుత్సాహాన్ని నింపింది.

కరోనాతో చితికిపోయిన కార్మికుల బతుకులు

ఫయాజ్, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్దాదాపు రెండు నెలలుగా విధించిన లాక్ టౌన్ తో ఉదయగిరి ప్రాంతంలోని కార్మికులు పూర్తిగా చితికిపోయారు నిండా అప్పుల్లో మునిగిపోయారు చేయడానికి పని లేక, చేసే వీలు లేక కుమిలిపోయారు ఇప్పటికే మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది మళ్లీ నాలుగోసారి కూడా రెండు వారాల పాటు పొడిగించింది ఈ పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు ఇతర పనులు చేసుకునే కార్మికులు రెండు నెలలుగా పనులు లేక అల్లాడిపోయారు రాష్ట్ర ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా అందించిన బియ్యం చాలా వరకు ఆదుకుంది. ఇచ్చిన వెయ్యి రూపాయలు ఏ మూలకు సరిపోలేదు పెద్ద కుటుంబాల వారికి ఆ బియ్యం కూడా సరిపోలేదు ఈ పరిస్థితుల్లో అప్పులు చేసే పరిస్థితి ఏర్పడింది ఎక్కడ చూసినా పేద కుటుంబాల వారు నిండా అప్పుల్లో మునిగిపోయారు అసలే కరువు ప్రాంతమైన ఉదయగిరిలో కరోనా పుణ్యమని మరింత కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి కొంతమంది భవన నిర్మాణాలు రెండు వారాలు గా పనులు చేయాలని తలచినా, సిమెంటు అందుబాటులోకి రాలేదు అరకొరగా వచ్చినా ధరల పెంపుతో నిర్మాణదారులు వెనుకంజ వేశారు దీంతో పని దొరక్క బేల్దారి మేస్త్రి లు కార్మికులు కటకట లాడిపోతున్నారు ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని వేయి కళ్ళతో నిరీక్షిస్తున్నారు పని ఉందంటే చాలు ఉదయాన్నే అక్కడికి చేరుతున్నారు తీవ్ర అక్కడ ఒకరిద్దరికే పని ఉందని తెలిసి నిరాశతో వేను తిరుగుతున్నారు ఇప్పటికీ చాలా హార్డ్ వేర్ షాపులు మూసి ఉండడంతో అవసరమైన సామాగ్రి లభించడం లేదు షాపులు తెరిచేందుకు అభ్యంతరం లేదని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మరో పక్క కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్న వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. షాపులు తీసేందుకు స్థానిక అధికారులు అంగీకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం వచ్చినా దానికి తగ్గ ఆనందోత్సాహాలు లేవు. కారణం ప్రతి వారి చేతుల్లో డబ్బులు లేక పోవడమే. ఈ మాసంలో విస్తృతంగా దానధర్మాలు, ఉపవాస దీక్ష ఆచరించిన వారికి విందువినోదాలు ఇచ్చే ఆనవాయితీ ఉంది. అయితే ఈసారి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది పనులు లేక ఎవరి చేతుల్లోనూ డబ్బులు లేవు వ్యాపారుల పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు వ్యాపారాలు పూర్తిస్థాయిలో జరగకపోయినా అద్దెలు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి రావడం మరింత భారంగా మారింది పండుగకు కొత్త బట్టలు కొనేవారు కూడా కరువయ్యారు ఈసారికి ఇలా మానేసి మరో పండక్కి కొనుక్కుందాం అని తాత్విక చింతనలో మునిగిపోయారు మొత్తం మీద కరోనా ప్రభావం చాలా జీవితాల్లో నిరుత్సాహాన్ని నింపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.