అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు.
గతంలో పాత హాస్పిటల్ భవనం శిధిలావస్థకు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ కొత్త హాస్పిటల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ చిట్వేలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఏ సమస్యలైనా ఎదురైతే ప్రభుత్వం అండగా ఉంటుంది, అని పేర్కొన్నారు.
చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతు చిట్వేలు ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యత. ఈ ఆసుపత్రిలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాం అన్నారు. డాక్టర్లు సూచించిన మరిన్ని వసతులను కూడా త్వరలో పర్మిషన్ చేయిస్తాం. చిట్వేలు నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగిన ప్రాంతం. కోడూరు – చిట్వేలు రోడ్డును కూడా త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తాం, అని తెలిపారు.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. చిట్వేలు హాస్పిటల్ ప్రారంభం వల్ల వేలాది మంది ప్రజలకు వైద్య సేవలు సులభతరం అవుతాయి, అని అన్నారు.
డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మణ్ నారాయణ మాట్లాడుతూ – “కొత్త హాస్పిటల్‌లో అన్ని సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయి. చిన్నచిన్న అవసరాలు డోనర్ల సహకారంతో తీర్చుకోవచ్చు. ఇక్కడ డెలివరీలు సహా అన్ని రకాల చికిత్సలు అందిస్తాం,” అని వివరించారు.
ఈ కార్యక్రమంలో పాటూరు శ్రీనివాస్ రెడ్డి, టిడిపి యువనేత గుత్తి నరసింహ, రవి ప్రకాష్, జనసేన నాయకుడు మాదాసు నరసింహులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వరలక్ష్మి, తాసిల్దార్ స్పందన, సిఐ వెంకటేశ్వర్లు, డీఎంఎన్ఓ డాక్టర్ విష్ణు, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ శేఖర్, డాక్టర్ అబ్దుల్ వకీల్ అన్సారి, హెల్త్ ఇస్మాయిల్ భాష, అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం మరొక ముందడుగు – చిట్వేలు కొత్త ఆసుపత్రి ఆరంభం
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో పాత హాస్పిటల్ భవనం శిధిలావస్థకు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ కొత్త హాస్పిటల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ చిట్వేలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఏ సమస్యలైనా ఎదురైతే ప్రభుత్వం అండగా ఉంటుంది, అని పేర్కొన్నారు. చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతు చిట్వేలు ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యత. ఈ ఆసుపత్రిలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాం అన్నారు. డాక్టర్లు సూచించిన మరిన్ని వసతులను కూడా త్వరలో పర్మిషన్ చేయిస్తాం. చిట్వేలు నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగిన ప్రాంతం. కోడూరు – చిట్వేలు రోడ్డును కూడా త్వరలో పూర్తి చేసి ప్రారంభిస్తాం, అని తెలిపారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. చిట్వేలు హాస్పిటల్ ప్రారంభం వల్ల వేలాది మంది ప్రజలకు వైద్య సేవలు సులభతరం అవుతాయి, అని అన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మణ్ నారాయణ మాట్లాడుతూ – “కొత్త హాస్పిటల్‌లో అన్ని సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయి. చిన్నచిన్న అవసరాలు డోనర్ల సహకారంతో తీర్చుకోవచ్చు. ఇక్కడ డెలివరీలు సహా అన్ని రకాల చికిత్సలు అందిస్తాం,” అని వివరించారు. ఈ కార్యక్రమంలో పాటూరు శ్రీనివాస్ రెడ్డి, టిడిపి యువనేత గుత్తి నరసింహ, రవి ప్రకాష్, జనసేన నాయకుడు మాదాసు నరసింహులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వరలక్ష్మి, తాసిల్దార్ స్పందన, సిఐ వెంకటేశ్వర్లు, డీఎంఎన్ఓ డాక్టర్ విష్ణు, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ శేఖర్, డాక్టర్ అబ్దుల్ వకీల్ అన్సారి, హెల్త్ ఇస్మాయిల్ భాష, అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

