పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల పెరిగిన చమురు, ఏటీఎఫ్ ధరల కారణంగా విమానయాన సంస్థలు ఫ్యూయల్ సర్‌చార్జీలు, అదనపు ఛార్జీలు వసూలు చేశాయి. ప్రస్తుతం చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో, ఇవే ధరలు స్థిరంగా కొనసాగితే సర్‌చార్జీలను సమీక్షించాలని విమానయాన సంస్థలను కోరతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించేలా కృషి చేస్తామని, దేశీయంగా ఏటీఎఫ్ ధరలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఎయిర్‌లైన్స్ సర్‌చార్జీలపై సమీక్షకు కేంద్రం నిర్ణయం