ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో APJAC అమరావతి కార్యవర్గం సమావేశం జరిగింది.
ఎపి జెఎసి అమరావతి మన హక్కుల సాధన కోసం ఉద్యమించాలని,
1. వెంటనే PRC కమీషనర్ ని నియమించి, తక్షణమే IR ని ప్రకటించాలని…….
2. DA బకాయిలు, పెండింగ్ DA లు ను వెంటనే చెల్లించాలని……..
3. కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ……
4. రిటైర్డ్ ఉద్యోగులకు గత ప్రభుత్వం తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ను పునరుద్దరించాలని……..
5. నిర్లక్షానికి గురైన ఉద్యోగుల హెల్త్ కార్డుని తక్షణమే పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలి
6. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న 2 సం చైల్డ్ కేర్ లీవ్ ను రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కూడా అమలు చేయాలని …….
7. ఉద్యోగికి రావలసిన బకాయిలను Pay Slip లో చూపించాలని……
8. పొదుపు చార్యలలో భాగంగా ఉద్యోగులందరికి 5 రోజులు పనిదినాలు అమలుచేయాలని ……
9. సరెండర్ లీవ్ లు ఎప్పటికప్పుడు చెల్లించాలని, తదితర ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ……
మన హక్కుల సాధనకు మనమే ఉద్యమించాలి ……
ఉద్యమానికి సిద్దంగా ఉండాలని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలకు
APJAC అమరావతి కార్యవర్గం పిలుపునిచ్చింది.
ఎపి జెఎసి అమరావతి


