*✒️- అదానీ ఎనర్జీ చేతికి ఇంటెల్లి స్మార్ట్.. రూ.3,050 కోట్లతో ఒప్పందం*
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ స్మార్ట్ మీటర్ల సంస్థ ఇంటెల్లి స్మార్ట్ ఇన్ఫ్రాలో వంద శాతం ఈక్విటీ వాటాను రూ. 3,050 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కొనుగోలుతో, 4.70 కోట్ల పైగా స్మార్ట్ మీటర్లతో భారతదేశంలోనే అతిపెద్ద స్మార్ట్ మీటరింగ్ ప్లాట్ఫారమ్ అదానీ ఎనర్జీ తన స్థానాన్ని బలోపేతం చేసుకోనుంది. ఇంటెల్లి స్మార్ట్ సంస్థకు యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్, అస్సాం రాష్ట్రాలలో రెండు కోట్ల ఇరవై లక్షలకు పైగా మీటర్ల పోర్ట్ఫోలియో ఉంది..🤟🏽

