ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి విధివిధానాలు ఖరారు కాకముందే, జీవో విడుదల చేయకముందే ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల మే నెల బేసిక్ పే నుంచి 1.5% వేతన కోత విధించడం సరికాదని, కట్ చేసిన వేతనం వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని టిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాహుల్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథక అమలుకు సంబంధించి ఎంప్లాయ్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశమై విధివిధానాలు ఖరారు చేయకుండానే, వైద్య చికిత్స అందించే ఆసుపత్రుల లిస్టు ప్రకటించకుండానే, అందించే వైద్య సేవల గురించి స్పష్టత ఇవ్వకుండానే, భార్యాభర్తలు, పెన్షనర్ల వేతనాల నుండి మినహాయింపులు ఎలా చేయాలో ప్రకటించకుండానే, ఎవరిని సంప్రదించకుండానే, ఆర్థిక శాఖ అత్యుత్సాహంతో మే నెల వేతనంలో కోత విధించడం సరికాదన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు హెల్త్ కార్డుల సమాచారము ఆన్లైన్లో నమోదు చేయాలని, రోజుకో సవరణతో గందరగోళం సృష్టిస్తూనే, ఇలా ఉన్నట్లుండి వేతన కోతను విధించడం ద్వారా ఉపాధ్యాయ, ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. కావున ఉద్యోగుల ఆరోగ్య పథకం విషయమై స్పష్టమైన విధివిధానాలు, మార్గదర్శకాలు ప్రకటించేంతవరకు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించరాదని, కోత విధించిన మొత్తాన్ని వెంటనే వారి యొక్క ఖాతాల్లో జమ చేయాలని కోరారు.

ఇ.హెచ్.ఎస్ పేరుతో వేతనంలో కోత సరికాదు