Friday, 3 July 2026
  • Home  
  • ఇంటర్ బోర్డు కమిషనర్ రంజిత్ భాషాకు నాన్ టీచింగ్ అసోసియేషన్ వినతి
- తిరుపతి

ఇంటర్ బోర్డు కమిషనర్ రంజిత్ భాషాకు నాన్ టీచింగ్ అసోసియేషన్ వినతి

శ్రీ కాళహస్తి, జులై 03 : (పున్నమి న్యూస్) : తిరుపతి జిల్లా పర్యటనలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ రంజిత్ భాషాను ఉమ్మడి చిత్తూరు జిల్లా నాన్ టీచింగ్ అసోసియేషన్ బృందం శుక్రవారం చంద్రగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికల) ఆవరణలో మర్యాదపూర్వకంగా కలిసింది. అసోసియేషన్ అధ్యక్షుడు కందాటి విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషనర్‌కు వినతిపత్రం అందజేసి, జిల్లా పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో సిబ్బంది ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఎయిడెడ్ కళాశాలల నుంచి వచ్చిన నాన్ టీచింగ్ సిబ్బంది సర్వీస్ నిబంధనల అంశాన్ని కూడా వివరించారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ, అర్హులైన సిబ్బంది అందరికీ ప్రమోషన్లు వచ్చేలా తగిన కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్‌ను కలిసిన వారిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నాన్ టీచింగ్ అసోసియేషన్ సెక్రటరీ మాధవ నివాస్, వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ గాంధీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ముని శంకర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరావు, షణ్ముఖ రెడ్డి, గిరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.