చిట్వేల్: దొగ్గలపాడు సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గొల్లపల్లికి చెందిన సిపిఐ నాయకుడు తిప్పన ప్రసాద్ కుమారుడు (15)కు ఒక కాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడగా, దొడ్డిపల్లి నరసింహులు, ఆయన కుమారుడు (9) తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న జె.ఎన్. ఆంధ్రయ్య తన కుమారుడు జె. సంతోష్‌తో కలిసి క్షతగాత్రులను తిరుపతిలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రహదారి ప్రమాదాలపై ఆంధ్రయ్య ఆందోళన వ్యక్తం చేశారు.




