తిరుచానూరు, ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్యసభ పార్లమెంటు సభ్యుడు చింతకాయల విజయ్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.


