Friday, 17 April 2026
  • Home  
  • కొవ్వూరులో కొత్తపల్లి ఆశిష్ లాల్‌కు ఘన స్వాగతం
- తూర్పు గోదావరి

కొవ్వూరులో కొత్తపల్లి ఆశిష్ లాల్‌కు ఘన స్వాగతం

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి /,కొవ్వూరు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన అనంతరం తొలిసారి కొవ్వూరు నియోజకవర్గానికి విచ్చేసిన కొత్తపల్లి ఆశిష్ లాల్‌కు కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాపవరం జంక్షన్ వద్ద ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, అక్కడి నుంచి కొవ్వూరు నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆశిష్ లాల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తూ, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. తాళ్లపూడి మండలం నుంచి నామా సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి /,కొవ్వూరు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన అనంతరం తొలిసారి కొవ్వూరు నియోజకవర్గానికి విచ్చేసిన కొత్తపల్లి ఆశిష్ లాల్‌కు కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాపవరం జంక్షన్ వద్ద ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, అక్కడి నుంచి కొవ్వూరు నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరిపారు.
ఈ సందర్భంగా ఆశిష్ లాల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తూ, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
తాళ్లపూడి మండలం నుంచి నామా సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.