వార్త ముఖ్యాంశాలు
- కొవ్వూరుపాడు సర్పంచ్‌గా వేగివాడ రమాదేవి..
- - ఉప సర్పంచ్ పదవి జనసేనకు కేటాయింపు తూర్పు గోదావరి జిల్లా నవంబర్ 29 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బలపరిచిన వేగివాడ రమాదేవి విజయం సాధించారు.
- గ్రామంలోని ఆయా పార్టీల నాయకులంతా ఐక్యంగా కృషి చేసి రమాదేవిని సర్పంచ్‌గా గెలిపించుకున్నారు.
కొవ్వూరుపాడు సర్పంచ్‌గా వేగివాడ రమాదేవి.. – ఉప సర్పంచ్ పదవి జనసేనకు కేటాయింపు
తూర్పు గోదావరి జిల్లా నవంబర్ 29
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని పార్టీలు బలపరిచిన వేగివాడ రమాదేవి విజయం సాధించారు. గ్రామంలోని ఆయా పార్టీల నాయకులంతా ఐక్యంగా కృషి చేసి రమాదేవిని సర్పంచ్‌గా గెలిపించుకున్నారు. అలాగే, నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులందరూ సమిష్టి నిర్ణయంతో జనసేన నాయకురాలు అంకెమ్ గంగాభవానికి ఉప సర్పంచ్ పదవి ఇవ్వనున్ననట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వేగివాడ రమాదేవి తెలిపారు. తమ గెలుపుకు సహకరించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.పున్నమి రిపోర్టర్ గోపినాథ్ కొండేపూడి