Wednesday, 30 September 2026
  • Home  
  • అచ్యుతాపురంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డులు
- అనకాపల్లి

అచ్యుతాపురంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డులు

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు దేశంశెట్టి శంకరరావు ఆధ్వర్యంలో కొండకర్ల, ఎర్రవరం, ఉప్పవరం, జగన్నాధపురం గ్రామాల్లో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేశంశెట్టి శంకరరావు మాట్లాడుతూ కార్యకర్తలు గ్రామస్థాయిలో సమన్వయంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కోన బుజ్జి మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది అన్నారు. లాలం రాంబాబు, నర్మల కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోన బుజ్జి, లాలం రాంబాబు, నర్మల కుమార్, భీముని వెంకటేశ్వరరావు, రవీంద్ర రాజు, గంగిరెడ్డి రాము, చిన్ని సత్తిబాబు, బుద్ధిరెడ్డి భాస్కర్, రవి, శోభన్, కాశీనాయుడు, భీముని నాగేశ్వరరావు, కట్టుమూరి శ్రీనివాసరావు, సిరసపల్లి సత్యనారాయణ, గంగిరెడ్డి రోహిత్, అప్పికొండ రాము తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో)

అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు దేశంశెట్టి శంకరరావు ఆధ్వర్యంలో కొండకర్ల, ఎర్రవరం, ఉప్పవరం, జగన్నాధపురం గ్రామాల్లో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా దేశంశెట్టి శంకరరావు మాట్లాడుతూ కార్యకర్తలు గ్రామస్థాయిలో సమన్వయంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కోన బుజ్జి మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది అన్నారు. లాలం రాంబాబు, నర్మల కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలవాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కోన బుజ్జి, లాలం రాంబాబు, నర్మల కుమార్, భీముని వెంకటేశ్వరరావు, రవీంద్ర రాజు, గంగిరెడ్డి రాము, చిన్ని సత్తిబాబు, బుద్ధిరెడ్డి భాస్కర్, రవి, శోభన్, కాశీనాయుడు, భీముని నాగేశ్వరరావు, కట్టుమూరి శ్రీనివాసరావు, సిరసపల్లి సత్యనారాయణ, గంగిరెడ్డి రోహిత్, అప్పికొండ రాము తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.