Wednesday, 30 September 2026
  • Home  
  • ప్రకృతి ప్రేమికుడు గట్టు కృష్ణమూర్తికి బీజేపీ ఘన సన్మానం
- పెద్దపల్లి

ప్రకృతి ప్రేమికుడు గట్టు కృష్ణమూర్తికి బీజేపీ ఘన సన్మానం

‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా సత్కరించిన బీజేపీ మంథని, సెప్టెంబరు 30: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల రోజులుగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా, మంథని పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త గట్టు కృష్ణమూర్తిని బీజేపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తన సొంత ఖర్చులతో పట్టణంలో విస్తృతంగా మొక్కలు నాటుతూ, ప్రమాదకరంగా మారిన రోడ్డు గుంతలను పూడుస్తూ ప్రజా సంక్షేమానికి కృష్ణమూర్తి కృషి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా, పాఠశాల విద్యార్థుల్లో పర్యావరణ ఆవశ్యకతపై చైతన్యం తెస్తూ, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేసిన ఆయన సేవలను నాయకులు కొనియాడారు.సన్మానం అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ భూమిపై ప్రతి జీవి మనుగడకు ప్రకృతి సహకారం ఎంతో అత్యవసరం అన్నారు. మానవ విచక్షణారాహిత్యం వల్ల ప్రకృతి నాశనమైతే అది మానవాళి జీవనానికే ముప్పుగా మారుతుందని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, ‘ఎల్ నినో’ వంటి వాతావరణ మార్పులు, భవిష్యత్తు వైపరీత్యాలను తట్టుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. మంథని ప్రజలందరూ నడుం బిగించి ప్రకృతి పరిరక్షణను ఒక యజ్ఞంలా నిర్వహించాలని పిలుపునిచ్చారు.పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బోగోజు శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, నారమల్ల కృష్ణ, బూడిద తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్, పట్టణ ఉపాధ్యక్షులు బొల్లంపల్లి లక్ష్మణ్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు గుడ్ల గురువేష్, పట్టణ కోశాధికారి వొడ్నాల శ్రీనివాస్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా సత్కరించిన బీజేపీ

మంథని, సెప్టెంబరు 30:

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల రోజులుగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా, మంథని పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త గట్టు కృష్ణమూర్తిని బీజేపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తన సొంత ఖర్చులతో పట్టణంలో విస్తృతంగా మొక్కలు నాటుతూ, ప్రమాదకరంగా మారిన రోడ్డు గుంతలను పూడుస్తూ ప్రజా సంక్షేమానికి కృష్ణమూర్తి కృషి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా, పాఠశాల విద్యార్థుల్లో పర్యావరణ ఆవశ్యకతపై చైతన్యం తెస్తూ, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేసిన ఆయన సేవలను నాయకులు కొనియాడారు.సన్మానం అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ భూమిపై ప్రతి జీవి మనుగడకు ప్రకృతి సహకారం ఎంతో అత్యవసరం అన్నారు. మానవ విచక్షణారాహిత్యం వల్ల ప్రకృతి నాశనమైతే అది మానవాళి జీవనానికే ముప్పుగా మారుతుందని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, ‘ఎల్ నినో’ వంటి వాతావరణ మార్పులు, భవిష్యత్తు వైపరీత్యాలను తట్టుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. మంథని ప్రజలందరూ నడుం బిగించి ప్రకృతి పరిరక్షణను ఒక యజ్ఞంలా నిర్వహించాలని పిలుపునిచ్చారు.పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బోగోజు శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, నారమల్ల కృష్ణ, బూడిద తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్, పట్టణ ఉపాధ్యక్షులు బొల్లంపల్లి లక్ష్మణ్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు గుడ్ల గురువేష్, పట్టణ కోశాధికారి వొడ్నాల శ్రీనివాస్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.