Saturday, 29 August 2026
  • Home  
  • హెచ్ఐవి నివారణ పద్ధతులను గురించి తెలుసుకోవాలి .
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

హెచ్ఐవి నివారణ పద్ధతులను గురించి తెలుసుకోవాలి .

కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కరపలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధిత ఫెడరేషన్ సభ్యులకు కండోమ్ వాడే నైపుణ్యాలు, పరిజ్ఞానం మరియు ఇతర హెచ్ఐవి నివారణ పద్ధతులపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ హెచ్ఐవి నివారణ పద్ధతులను గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి మండల స్థాయి ఇంప్లిమెంటరు డి అర్జునరావు మాట్లాడుతూ కండోమ్ వాడే నైపుణ్యాలను గురించి వివరించారు. కండోమ్ సరైన పద్ధతిలో వాడటం ద్వారా మాత్రమే ఉపయోగం ఉంటుందన్నారు. కనుక కండోమ్ ను ఉపయోగించేవారు గడువు తేదీ పూర్తయింది లేనిది నిర్ధారించుకోవాలన్నారు.అదేవిధంగా కండోమ్ ప్యాకెట్లు గాలి ఉందో లేదో నొక్కి చూడాలన్నారు. గాలి ఉన్నట్లయితే కండోమ్ సురక్షితంగా ఉన్నట్లేనని అన్నారు. కండోములను పర్సులో మరియు జేబుల్లో పెట్టుకోవడం ద్వారా నలిగిపోయి పనికిరాని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పి.సత్య మాట్లాడుతూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ పరిధిలోని స్త్రీ, పురుషులు మరియు బీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.