అనకాపల్లి, పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
విద్యుత్ వినియోగదారులపై ఒత్తిడి, బెదిరింపులకు పాల్పడి స్మార్ట్ మీటర్లను బిగించడం తక్షణమే నిలిపివేయాలని అనకాపల్లి పట్టణ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సంఘం ఆధ్వర్యంలో APEPDCL అనకాపల్లి సూపరింటెండెంట్ ఇంజనీర్, కార్యనిర్వహణ ఇంజనీర్లను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ అదానీ స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే నిలుపుదల చేయాలని, వినియోగదారులపై వివిధ పేర్లతో మోపుతున్న అదనపు చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం కన్వీనర్ బి. ఉమామహేశ్వరరావు, కో-కన్వీనర్ పెంటకోట శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బొడ్డేడ అప్పారావు, కాళ్ల తాలయ్యబాబు, మద్దిల అప్పారావు, జె. రమేష్‌బాబు, గంటా శ్రీరామ్, పెంటకోట జగన్నాథం, అల్లు రాజు తదితరులు పాల్గొన్నారు.


