Thursday, 24 September 2026
  • Home  
  • స్థానిక ఎన్నికల వేళ.. ఉత్తరాంధ్ర వైసీపీ నేతల కీలక భేటీ!
- అనకాపల్లి

స్థానిక ఎన్నికల వేళ.. ఉత్తరాంధ్ర వైసీపీ నేతల కీలక భేటీ!

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్రలో పార్టీ శ్రేణుల సమన్వయం, గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం, ఎన్నికలకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. సమావేశంలో ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, డాక్టర్ బొత్స అనూష, ఎమ్మెల్సీలు కళ్యాణి, రవిబాబు, రాజ్యసభ సభ్యులు బాబురావు, విశాఖ పార్టీ అధ్యక్షులు కేకే రాజు, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్, చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)

తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్రలో పార్టీ శ్రేణుల సమన్వయం, గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం, ఎన్నికలకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. సమావేశంలో ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, డాక్టర్ బొత్స అనూష, ఎమ్మెల్సీలు కళ్యాణి, రవిబాబు, రాజ్యసభ సభ్యులు బాబురావు, విశాఖ పార్టీ అధ్యక్షులు కేకే రాజు, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్, చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.