Thursday, 24 September 2026
  • Home  
  • బోగోలు మండల పరిధిలో నులి పురుగుల నివారణకు పకడ్బందీ చర్యలు పున్నమి న్యూస్ రిపోర్టర్ బోగోలు మండలం గోపాలకృష్ణారెడ్డిబోగోలు: జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా బోగోలు మండలంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలల పరిధిలోని విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు ఆల్బెండజోల్ మాత్రలను మధ్యాహ్న భోజనం అనంతరం అందించేందుకు చర్యలు చేపట్టారు.మండల స్థాయి అధికారుల సమన్వయ సమావేశం బోగోలు మండల MPDO కార్యాలయంలో నిర్వహించారు. మండల పరిధిలో మొత్తం 8,030 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో MPDO, తహశీల్దార్, MEO, మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు. నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.సెప్టెంబర్ 25న నిర్వహించే జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.
- ఆంధ్రప్రదేశ్

బోగోలు మండల పరిధిలో నులి పురుగుల నివారణకు పకడ్బందీ చర్యలు పున్నమి న్యూస్ రిపోర్టర్ బోగోలు మండలం గోపాలకృష్ణారెడ్డిబోగోలు: జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా బోగోలు మండలంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జూనియర్ కళాశాలల పరిధిలోని విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు ఆల్బెండజోల్ మాత్రలను మధ్యాహ్న భోజనం అనంతరం అందించేందుకు చర్యలు చేపట్టారు.మండల స్థాయి అధికారుల సమన్వయ సమావేశం బోగోలు మండల MPDO కార్యాలయంలో నిర్వహించారు. మండల పరిధిలో మొత్తం 8,030 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో MPDO, తహశీల్దార్, MEO, మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు. నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.సెప్టెంబర్ 25న నిర్వహించే జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.