శ్రీకాళహస్తి, జూన్ 09, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ బొజ్జల కుటుంబ సేవా సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డిని టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ ప్రశంసించారు. రిషితా రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక కుమారస్వామి తిప్ప వద్ద ఉన్న రిపబ్లిక్ క్లబ్ కూడలిలో కాసరం రమేష్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మకు వేదపండితులు ఆశీర్వాదాలు అందజేయగా, చిన్నారులతో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కాసరం రమేష్ మాట్లాడుతూ….గత ఎన్నికల్లో సుధీర్ రెడ్డి విజయంలో రిషితా రెడ్డి కీలక పాత్ర పోషించారని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పేదల ఆత్మీయురాలిగా గుర్తింపు పొందారని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్న రిషితా రెడ్డి- కాసరం రమేష్