పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్, హోంగార్డ్ సిబ్బందిని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘనంగా సన్మానించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన అధికారులకు పూలమాలలు, శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో సుదీర్ఘకాలం విధులు నిర్వహిస్తూ ప్రజలకు, శాఖకు ఎనలేని సేవలు అందించినందుకు ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందిని అభినందించారు. విధి నిర్వహణలో వారికి అండగా నిలిచిన కుటుంబ సభ్యుల సేవలను కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఉద్యోగ విరమణ పొందిన వారిలో వి. సుధాకర్ రెడ్డి (SI), కె. రాయప్ప (SI), వి. రామరావు (SI), ఎం. శ్రీనివాసరావు (ASI), MD. అబ్దుల్ రహెమాన్ (ASI), SK. అహ్మద్ (HC), కె. సత్యం (HC), బి. సుందర్ రావు (ARSI), R. వెంకటేశ్వర్లు (హోంగార్డ్) ఉన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఆర్‌ఐలు కామరాజు, సురేష్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు హేమనాధ్, హోంగార్డు సంక్షేమ సంఘం అధ్యక్షులు బంక శ్రీను, జాతీయ ఉపాధ్యక్షులు E. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.



