ఉదయగిరి: జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ఉదయగిరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు RTC డిపో సమీపం నుంచి క్రింది బస్టాండ్ వరకు భారీ బైక్ ర్యాలీ, అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది.
ఉదయం 10 గంటలకు షాద్ మంజిల్‌లో జనసేన యువజన విభాగం ఆవిష్కరణ నిర్వహించనున్నారు. యువజన విభాగం లక్ష్యాలు, యువతలో రాజకీయ చైతన్యం తదితర అంశాలపై పవన్ కళ్యాణ్ గారు ఆన్‌లైన్ ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ కార్యక్రమాల్లో ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన పార్టీ కోరింది.


