అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 15 – పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్:
ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC)ల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు SMC ఎన్నికల షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 15న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా, సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితాను పాఠశాలల్లో ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్ 25న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు తుది జాబితా ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు SMC ఎన్నికలు నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధికారులు పర్యవేక్షించనున్నారు.


