Thursday, 20 August 2026
  • Home  
  • సెప్టెంబర్ 17 నుండి తిన్మార్ మల్లన్న పాదయాత్ర
- జనగాం

సెప్టెంబర్ 17 నుండి తిన్మార్ మల్లన్న పాదయాత్ర

తెలంగాణ రాజ్యాధికార పార్టీ – ముఖ్య సమావేశం –కట్ల సదానందం, టి ఆర్ పి జనగామ అధ్యక్షులు —————————— జనగామ, ఆగష్టు 19, పున్నమి జిల్లా ప్రతినిధి: ఈ రోజు సాయంత్రం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మరియు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌లతో ముఖ్య సమావేశం జరిగిందని టి ఆర్ పి జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం తెలిపారు. సమావేశం ప్రధాన ఉద్దేశ్యం వివరాలు, సెప్టెంబర్ 17వ తేదీ నుంచి తీన్మార్ మల్లన్న గారి పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులందరూ పూర్తి స్థాయిలో సిద్ధమై, పార్టీని మరింత బలోపేతం చేస్తూ దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని మల్లన్న దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ప్రధానంగా సూచించిన అంశాలు : 1. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల నియామకం ప్రతి నియోజకవర్గానికి సమర్థవంతమైన ఇన్‌చార్జ్‌లను ఎంపిక చేసి, పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలి. 2. ప్రతి సమస్యపై సోషల్ మీడియా వేదికగా పోరాటం ప్రజా సమస్యలను గుర్తించి, ప్రతి జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు మరియు పార్టీ నాయకులు ఆయా సమస్యలపై నిరంతరం సోషల్ మీడియాలో మాట్లాడాలి. ప్రతి ప్రజా సమస్యను పార్టీ తరఫున బలంగా టేకప్ చేయాలి. 3.పాదయాత్ర వాలంటీర్ల నమోదు సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రను విజయవంతం చేసేందుకు అవసరమైన వాలంటీర్లను తక్షణమే గుర్తించి, నమోదు ప్రక్రియను ఆగస్టు 31వ తేదీలోపు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 4.పార్టీ సభ్యత్వ కార్యక్రమం తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి, ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గ స్థాయిలో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలి. 5.మండల అధ్యక్షుల నియామకం రాష్ట్రంలోని అన్ని మండలాలకు అధ్యక్షుల నియామక ప్రక్రియను ఆగస్టు 31వ తేదీలోపు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. GEN-Z తో మల్లన్న* ” కార్యక్రమం ప్రతి జిల్లాలో *“GEN-Z తో మల్లన్న”* కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, GEN-Z ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మల్లన్న పిలుపు: “సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రతో తెలంగాణలో రాజ్యాధికార సాధన కోసం పార్టీ శ్రేణులందరం మరింత ఐక్యంగా, క్రమశిక్షణతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి” అని తీన్మార్ మల్లన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ – ముఖ్య సమావేశం
–కట్ల సదానందం, టి ఆర్ పి జనగామ అధ్యక్షులు
——————————
జనగామ, ఆగష్టు 19, పున్నమి జిల్లా ప్రతినిధి:
ఈ రోజు సాయంత్రం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మరియు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌లతో ముఖ్య సమావేశం జరిగిందని టి ఆర్ పి జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం తెలిపారు.
సమావేశం ప్రధాన ఉద్దేశ్యం వివరాలు,
సెప్టెంబర్ 17వ తేదీ నుంచి తీన్మార్ మల్లన్న గారి పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులందరూ పూర్తి స్థాయిలో సిద్ధమై, పార్టీని మరింత బలోపేతం చేస్తూ దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని మల్లన్న దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో ప్రధానంగా సూచించిన అంశాలు :
1. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల నియామకం
ప్రతి నియోజకవర్గానికి సమర్థవంతమైన ఇన్‌చార్జ్‌లను ఎంపిక చేసి, పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలి.
2. ప్రతి సమస్యపై సోషల్ మీడియా వేదికగా పోరాటం
ప్రజా సమస్యలను గుర్తించి, ప్రతి జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు మరియు పార్టీ నాయకులు ఆయా సమస్యలపై నిరంతరం సోషల్ మీడియాలో మాట్లాడాలి. ప్రతి ప్రజా సమస్యను పార్టీ తరఫున బలంగా టేకప్ చేయాలి.
3.పాదయాత్ర వాలంటీర్ల నమోదు
సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రను విజయవంతం చేసేందుకు అవసరమైన వాలంటీర్లను తక్షణమే గుర్తించి, నమోదు ప్రక్రియను ఆగస్టు 31వ తేదీలోపు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
4.పార్టీ సభ్యత్వ కార్యక్రమం
తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి, ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గ స్థాయిలో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలి.
5.మండల అధ్యక్షుల నియామకం
రాష్ట్రంలోని అన్ని మండలాలకు అధ్యక్షుల నియామక ప్రక్రియను ఆగస్టు 31వ తేదీలోపు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
GEN-Z తో మల్లన్న* ” కార్యక్రమం
ప్రతి జిల్లాలో *“GEN-Z తో మల్లన్న”* కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, GEN-Z ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
మల్లన్న పిలుపు:
“సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రతో తెలంగాణలో రాజ్యాధికార సాధన కోసం పార్టీ శ్రేణులందరం మరింత ఐక్యంగా, క్రమశిక్షణతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి” అని తీన్మార్ మల్లన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.