సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల జవాబు పత్రాల రీ-వాల్యుయేషన్ అనంతరం పలువురు విద్యార్థుల మార్కులు గణనీయంగా పెరిగాయి. ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంలో పలు లోపాలు ఉన్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కొన్ని జవాబు పత్రాల్లో పేజీలు కనిపించకపోవడం, మ్యాప్‌లు లేదా గ్రాఫ్‌లు సరిగా ప్రదర్శించకపోవడం, తప్పు మార్కింగ్ స్కీమ్ ఆధారంగా మూల్యాంకనం జరగడం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీంతో లక్షలాది మంది విద్యార్థులు రీ-వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో అనేక మంది విద్యార్థుల మార్కులు పెరగడంతో సీబీఎస్ఈ మూల్యాంకన విధానంపై మరోసారి చర్చ ప్రారంభమైంది.

రీ-వాల్యుయేషన్ తర్వాత సీబీఎస్ఈ విద్యార్థులకు భారీగా పెరిగిన మార్కులు