కొత్తగూడెం, ఆగస్టు 29: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘాలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జిమ్మిక్కులు చేస్తున్నాయని టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కాపు కృష్ణ విమర్శించారు. కొత్తగూడెంలోని టీబీజీకేఎస్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐఎన్టీయూసీ 36, ఏఐటీయూసీ 48 హామీలు ఇచ్చినా రెండేళ్ల ఎనిమిది నెలలు కావస్తున్నా ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్మికులను ఆకట్టుకునేందుకు కొత్త ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. టీబీజీకేఎస్ హయాంలో ప్రతి రెండు నెలలకు వైద్య బోర్డులు నిర్వహించేవారని, అనర్హత కేసుల్లో 80–90 శాతం వరకు పరిష్కారం చూపడంతో పాటు సుమారు 14 వేల మందికి వారసత్వ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ప్రస్తుతం వైద్య బోర్డులు, అనర్హత కేసుల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో చర్యలు లేవని విమర్శించారు. 250 గజాల ఇంటి స్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణాలు, మారుపేర్ల సమస్య పరిష్కారం, ఆదాయపు పన్ను రద్దు వంటి హామీలు అమలు కాలేదన్నారు. కార్మికులు సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు, నిరాహార దీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సమ్మె నోటీసులు ఇవ్వడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. కార్మికుల పెండింగ్ సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని, సింగరేణి లాభాలను సెప్టెంబర్‌లోగా ప్రకటించి కార్మికులకు 40 శాతం లాభాల వాటా ఇవ్వాలని కాపు కృష్ణ డిమాండ్ చేశారు. సమావేశంలో కుమ్మరి శ్రీనివాస్‌రావు, రాజశేఖర్, కె. విజయ్‌కుమార్, కంచర్ల శ్రీనివాస్, మారపాక తిరుపతి, రవి వర్మ, సూర్యనారాయణ, ఎన్. వెంకటరెడ్డి, ఎన్. శంకర్, శ్రవణ్, జి. దేవాసింగ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణిలో హామీల అమలు ఎక్కడ?