Saturday, 25 April 2026
  • Home  
  • సాగు రైతులకు పరిహారం లేకుండానే శంఖుస్థాపనపై ఆగ్రహం – సిపిఎం నాయకుల మద్దతుతో రైతుల నిరసన..
- అనకాపల్లి

సాగు రైతులకు పరిహారం లేకుండానే శంఖుస్థాపనపై ఆగ్రహం – సిపిఎం నాయకుల మద్దతుతో రైతుల నిరసన..

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 24 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ ): రైతులకు సరైన పరిహారం చెల్లించకుండా సోలార్ ప్రాజెక్ట్‌కు శంఖుస్థాపన చేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంబిల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్ కోసం సుమారు 320 ఎకరాల సాగుభూములను స్వాధీనం చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు అనేక మంది రైతులకు పరిహారం అందలేదని బాధితులు తెలిపారు. సుమారు 120 మంది రైతులు ఇంకా నష్టపోయిన పరిస్థితిలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సిపిఎం నాయకులు కూడా స్పందించి రైతులకు మద్దతు తెలిపారు. రైతులకు న్యాయం చేయకుండా ప్రాజెక్ట్ పనులు ప్రారంభించడం తగదని వారు విమర్శించారు. భూములు తీసుకున్న వెంటనే పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని సిపిఎం నేతలు పేర్కొన్నారు. రైతులు, గ్రామస్తులు కలిసి అధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ సరైన స్పందన రాలేదని ఆరోపించారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న పరిహారం చెల్లించాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ, రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 24 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ ):
రైతులకు సరైన పరిహారం చెల్లించకుండా సోలార్ ప్రాజెక్ట్‌కు శంఖుస్థాపన చేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంబిల్లి మండలంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్ కోసం సుమారు 320 ఎకరాల సాగుభూములను స్వాధీనం చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు అనేక మంది రైతులకు పరిహారం అందలేదని బాధితులు తెలిపారు. సుమారు 120 మంది రైతులు ఇంకా నష్టపోయిన పరిస్థితిలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై సిపిఎం నాయకులు కూడా స్పందించి రైతులకు మద్దతు తెలిపారు. రైతులకు న్యాయం చేయకుండా ప్రాజెక్ట్ పనులు ప్రారంభించడం తగదని వారు విమర్శించారు. భూములు తీసుకున్న వెంటనే పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని సిపిఎం నేతలు పేర్కొన్నారు.
రైతులు, గ్రామస్తులు కలిసి అధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ సరైన స్పందన రాలేదని ఆరోపించారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న పరిహారం చెల్లించాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ, రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.