Tuesday, 23 June 2026
  • Home  
  • సంగం బ్యారేజీ మరమ్మతులకు రూ.1.99 కోట్లు మంజూరు!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగం బ్యారేజీ మరమ్మతులకు రూ.1.99 కోట్లు మంజూరు!

-నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న పొర్లు కట్టలు, వరద కట్టల మరమ్మతుల కోసం రూ.1.99 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని సంగం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న పొర్లు కట్టలు, వరద కట్టలు తదితర మరమ్మత్తుల కోసం రూ.1.98 కోట్ల 95 వేల 377 వ్యయంతో 10 పనులకు పరిపాలనా అనుమతులు లభించినట్లు తెలుగుగంగ ఈఈ అనీల్ కుమార్ రెడ్డి తెలిపారు. బ్యారేజీని సందర్శించి పరిశీలించిన ఆయన, బెడ్ పిచింగ్ పునరుద్ధరణ, పెన్నానది ఎడమ గట్టు రక్షణ, రహదారి మరమ్మత్తులు చేపట్టనున్నట్లు చెప్పారు. త్వరలో పనులు ప్రారంభించి నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని వెల్లడించారు.

-నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న పొర్లు కట్టలు, వరద కట్టల మరమ్మతుల కోసం రూ.1.99 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని సంగం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న పొర్లు కట్టలు, వరద కట్టలు తదితర మరమ్మత్తుల కోసం రూ.1.98 కోట్ల 95 వేల 377 వ్యయంతో 10 పనులకు పరిపాలనా అనుమతులు లభించినట్లు తెలుగుగంగ ఈఈ అనీల్ కుమార్ రెడ్డి తెలిపారు. బ్యారేజీని సందర్శించి పరిశీలించిన ఆయన, బెడ్ పిచింగ్ పునరుద్ధరణ, పెన్నానది ఎడమ గట్టు రక్షణ, రహదారి మరమ్మత్తులు చేపట్టనున్నట్లు చెప్పారు. త్వరలో పనులు ప్రారంభించి నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.