శ్రీ కాళహస్తి, జూన్ 17, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తిలో జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, చైర్మన్ జగన్నాథ నాయుడు, సెక్రటరీ బాలాజీ ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి చర్చించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. బిజెపి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కోలా ఆనంద్, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి, మునిరాజానాయుడు కూడా ఈ పోటీల నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పురుషుల, స్త్రీల జట్లతో పాటు ఇండియన్ రైల్వేస్ జట్లు కూడా పాల్గొంటాయి. మొత్తం 750 మంది క్రీడాకారులు, 250 మంది అధికారులు కలిపి సుమారు 1,000 మంది ఈ పోటీలకు హాజరవుతారని ప్రెసిడెంట్ వెంకటస్వామి తెలిపారు. బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో సంప్రదించి, పోటీలు జరిగే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు