శ్రీ కాళహస్తి, జులై 21, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిపట్టణంలోని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ‘పార్టీకి ప్రజలే బలం – ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్’ పోస్టర్లను ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. వైఎస్సార్‌సీపీపై జరుగుతున్న కుట్రలు, కార్యకర్తలపై దాడుల సమాచారాన్ని వేగంగా చేరవేయడంలో జగన్ 2.0 యాప్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో ‘జగన్ 2.0’ యాప్ పోస్టర్ ఆవిష్కరణ