Wednesday, 6 May 2026
  • Home  
  • శ్రీకాళహస్తి వ్యాపార రంగంలో కొత్త దశ – చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
- తిరుపతి

శ్రీకాళహస్తి వ్యాపార రంగంలో కొత్త దశ – చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

శ్రీకాళహస్తి, మే 06 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణ వ్యాపార రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ స్థానిక సరస్వతి ఆడిటోరియంలో బుధవారం శ్రీకాళహస్తి చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ఎన్నికలు మరియు ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి సుమారు 300 మంది వ్యాపారస్తులు హాజరై ఐక్యతను చాటారు. తిరుపతి జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కేవీ చౌదరి, తిరుపతి నగర ప్రతినిధుల సమక్షంలో నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. చాంబర్ అధ్యక్షులుగా ముచ్చెల్లి సురేంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా, కార్యవర్గ సభ్యులు ఆయనతో పాటు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సందేశం పంపుతూ నూతన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి మాట్లాడుతూ, వ్యాపారస్తులందరూ ఒకే వేదికపైకి రావడం అభినందనీయం అని, పట్టణ అభివృద్ధిలో చాంబర్ పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రముఖ ఆడిటర్ మల్లికార్జున జీఎస్టీ, వ్యాపార నిర్వహణ మరియు ఆర్థిక వ్యవహారాలపై సభ్యులకు అవగాహన కల్పిస్తూ విలువైన సూచనలు అందించారు. అనంతరం నూతన అధ్యక్షులు సురేంద్రబాబు మాట్లాడుతూ….వ్యాపారస్తుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం చాంబర్ ఒక గొడుగులా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ వ్యాపారవేత్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.