అరకులోయ మండలం, రవ్వలగుడ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సంపత్ సాయి ట్రేడర్స్ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
నిర్వాహకులు పాంగి బలరాం, పి.వి.వి. ప్రశాద్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఐరన్, సిమెంట్, ఇటుకలు, ఎంఎస్ పైపులు తదితర నిర్మాణ సామగ్రి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వ్యాపారం విజయవంతంగా సాగి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నేత ద్రౌపది, స్థానికులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.


