Thursday, 9 July 2026
  • Home  
  • *మొబైల్ లో లీనమయ్యాడు మృత్యువు ఒడిలోకి జారిపోయాడు*
- News

*మొబైల్ లో లీనమయ్యాడు మృత్యువు ఒడిలోకి జారిపోయాడు*

*మొబైల్ లో లీనమయ్యాడు మృత్యువు ఒడిలోకి జారిపోయాడు* *మొబైల్ చూస్తూ వెళ్తున్న వ్యక్తిని బస్సు ఢీకొనడంతో వ్యక్తి మృతి* *విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన సంఘటన* *విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో చోటుచేసుకున్న ఒక ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అవనిగడ్డ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బస్టాండ్ నుండి బయటకు వస్తున్న సమయంలో.. చీరాలకు (బొర్రా వారి పాలెం) చెందిన బొర్రా గిరీష్ తన మొబైల్ ఫోన్ స్క్రీన్‌ను చూసుకుంటూ, పూర్తిగా అందులోనే మునిగిపోయి నడుస్తూ, బస్సు వస్తున్న విషయాన్ని గమనించకుండా దానికి అడ్డంగా వెళ్ళిపోయాడు. దాంతో అతను అప్రమత్తమయ్యే లోపే బస్సు చక్రాల కింద పడిపోవడంతో, భారీ చక్రాలు అతనిపై నుంచి దూసుకెళ్లి అక్కడికక్కడే అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఊహించని ఘటనతో బస్టాండ్‌లో ఒక్కసారిగా కలకలం రేగగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆ వ్యక్తి ఫోన్ చూస్తూ అజాగ్రత్తగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు* Uploaded Video:

*మొబైల్ లో లీనమయ్యాడు మృత్యువు ఒడిలోకి జారిపోయాడు*

*మొబైల్ చూస్తూ వెళ్తున్న వ్యక్తిని బస్సు ఢీకొనడంతో వ్యక్తి మృతి*

*విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన సంఘటన*

*విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో చోటుచేసుకున్న ఒక ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అవనిగడ్డ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బస్టాండ్ నుండి బయటకు వస్తున్న సమయంలో.. చీరాలకు (బొర్రా వారి పాలెం) చెందిన బొర్రా గిరీష్ తన మొబైల్ ఫోన్ స్క్రీన్‌ను చూసుకుంటూ, పూర్తిగా అందులోనే మునిగిపోయి నడుస్తూ, బస్సు వస్తున్న విషయాన్ని గమనించకుండా దానికి అడ్డంగా వెళ్ళిపోయాడు. దాంతో అతను అప్రమత్తమయ్యే లోపే బస్సు చక్రాల కింద పడిపోవడంతో, భారీ చక్రాలు అతనిపై నుంచి దూసుకెళ్లి అక్కడికక్కడే అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఊహించని ఘటనతో బస్టాండ్‌లో ఒక్కసారిగా కలకలం రేగగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆ వ్యక్తి ఫోన్ చూస్తూ అజాగ్రత్తగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు*

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.