శ్రీ కాళహస్తి, జులై 09, (పున్నమి న్యూస్) : ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ విజయవంతంగా ఒక సంవత్సరం పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయనకు ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి పవిత్ర తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం పీవీఎన్ మాధవ్ నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అభినందనల అనంతరం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకత్వంతో జరిగిన కీలక ముఖాముఖి సమావేశంలో కోలా ఆనంద్ పాల్గొన్నారు. ఈ సదస్సులో రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన వివిధ సేవా కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.

వీఎన్ మాధవ్ ఏడాది పదవీకాలం పూర్తి-ముక్కంటి ప్రసాదాలు అందజేసిన కోలా ఆనంద్