శ్రీ కాళహస్తి, జూన్ 16, (పున్నమి న్యూస్) : స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆత్మ బంధువులైన బీసీ వర్గాలపై కక్ష పెంచుకున్న వైసీపీ అరాచకానికి చిరుత అమర్నాథ్ గౌడ్ అమరుడయ్యాడని శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దౌర్జన్యానికి బలైన అమర్నాథ్ గౌడ్ మూడవ వర్ధంతి సందర్భంగా మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాలుడి చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. పసి పిల్లాడని కూడా చూడకుండా పెట్రోల్ పోసి తగలబెట్టేసిన వైసీపీ దుర్మార్గానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని మండిపడ్డారు. అమర్నాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. వైసీపీ సైకోల దాష్టీకానికి బలైన ఎంతోమంది అమరులలో అమర్నాథ్ గౌడ్ మరణం అత్యంత బాధాకరమైనదన్నారు. వైసీపీ నాయకులు తన అక్కను వేధింపులకు గురి చేయడాన్ని చూసి తట్టుకోలేక ప్రశ్నించినందుకు.. బడికి వెళ్తున్న 15 సంవత్సరాల అమర్నాథ్ గౌడ్‌ను దారుణంగా కొట్టి, కట్టేసి సజీవ దహనం చేసి చిన్నారి ప్రాణాలను చిదిమేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ అరాచకానికి అమర్నాథ్ గౌడ్ బలి-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి