శ్రీ కాళహస్తి, మే 24, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక కరుణీక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఘనంగా ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరంబాకం ముని ప్రసాద్, ఉపాధ్యాయుడు రజనీకాంత్ హాజరై విద్యార్థులకు నగదు బహుమతులు, మెమెంటోలను అందజేసి అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఈ ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నట్లు కరుణీక సంఘ కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రముఖులు కె.ఉమా శంకర్, పి.సూర్య ప్రకాష్, కె. రమేష్, యు.రజినీకాంత్, వరదరాజులు, పండితులు చెంచు కృష్ణ పిళ్ళై, జి.శరత్ కుమార్, పి. హేమచంద్రతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విద్యార్థులకు కరుణీక సంఘం ప్రతిభా పురస్కారాలు